తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​లో ఇప్పుడు మరింత 'ఈజీ'- ర్యాంక్​ 63 - 63వ స్థానంలోకి భారత్​ట

సులభతర వాణిజ్య విధానాలు అమలు చేసే దేశాల జాబితాలో భారత్​ ర్యాంక్​ మరింత మెరుగైంది. ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన 'ఈజ్ ఆఫ్​ డూయింగ్​​ బిజినెస్​' ర్యాంకుల్లో 14 స్థానాలు ఎగబాకి 63వ స్థానానికి చేరుకుంది. వరుసగా మూడో ఏడాది అత్యుత్తమ పనితీరు కనబరిచిన తొలి పది దేశాల జాబితాలో నిలిచింది భారత్​.

భారత్​లో మరింత ఈజీ

By

Published : Oct 24, 2019, 9:25 AM IST

సులువుగా వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి అనువైన దేశాల జాబితాలో భారత్​ మరింత మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన ఈ సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఏకంగా 14 స్థానాలు మెరుగుపరుచుకుని 63వ స్థానం సొంతం చేసుకుంది. ప్రభుత్వం చేపట్టిన 'మేక్​ ఇన్​ ఇండియా'తో పాటు ఇతర సంస్కరణలతో విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో.. భారత్​ మెరుగైన ర్యాంకును సాధించినట్లు ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది.

వరుసగా మూడో ఏడాది సులభతర వాణిజ్యంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన తొలి పది దేశాల సరసన నిలిచి రికార్డు సృష్టించింది భారత్​.

భారతీయ రిజర్వ్​ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలు భారత ఆర్థిక వృద్ధి రేటును తగ్గించిన నేపథ్యంలో సులభతర వాణిజ్యంలో మంచి ర్యాంకు సాధించటం భారత్​కు అనుకూల అంశం.

5 ఏళ్లలో.. 79 స్థానాలు..

2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో 190 దేశాలకు ఇచ్చిన ర్యాంకుల్లో భారత్​ 142వ స్థానంలో నిలిచింది. ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల కారణంగా 2017లో 100వ స్థానంలో నిలిచిన భారత్‌.. 2018లో 23 స్థానాలు ఎగబాకి 77వ స్థానానికి చేరింది. తాజాగా 2019లో 63వ ర్యాంకును సాధించింది.

" అత్యుత్తమ పనితీరు కనబరిచిన తొలి పది దేశాల జాబితాలో వరుసగా మూడో ఏడాది భారత్​ నిలిచింది. 20 ఏళ్లలో కొన్ని దేశాలు మాత్రమే ఈ విజయాన్ని సాధించాయి. ఈ ఏడాది ఏకంగా 14 స్థానాలు ఎగబాకింది. సులభతర వాణిజ్యంలో.. రానున్న రెండేళ్లలోపు టాప్​ 50 లోకి వెళ్లనుంది. ఇందుకు భారత్​ మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది."

- సిమియన్​ జంకోచ్​, ప్రపంచ బ్యాంకు ఆర్థిక శాస్త్ర అభివృద్ధి డైరెక్టర్​.

అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన దేశాలు..

సౌదీ అరేబియా (62), జోర్డన్​ (75), టోగో (97), బహ్రెయిన్​ (43), తజకిస్థాన్​ (106), పాకిస్థాన్​ (108), కువైట్​ (83), చైనా (31), నైజీరియా (131).

తొలి స్థానంలో న్యూజిలాండ్​..

190 దేశాలున్న ఈ జాబితాలో న్యూజిలాండ్‌ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సింగపూర్‌, హాంకాంగ్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి: గూగుల్​ సూపర్‌ డూపర్‌ క్వాంటమ్‌ చిప్‌

ABOUT THE AUTHOR

...view details