రెండో దశ కరోనా(Corona Virus) ఉద్ధృతి క్రమంగా తగ్గుతున్న వేళ భారతీయ స్టేట్ బ్యాంక్ రూపొందించిన నివేదిక ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నుంచే మూడో దశ వ్యాప్తి(Third wave) ప్రారంభమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.
'కొవిడ్-19: ది రేస్ టు ఫినిషింగ్ లైన్' పేరిట ఎస్బీఐ రీసెర్చ్ ఈ నివేదికను రూపొందించింది. మే 7న భారత్.. రెండో దశ తీవ్ర స్థితికి చేరిందని తెలిపింది. ఈ గణాంకాలను బట్టి జులై రెండో వారంలో సుమారు రోజుకు పదివేల కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆగస్టు రెండో అర్ధభాగంలో కేసులు పెరుగుతాయని పేర్కొంది.