తెలంగాణ

telangana

ETV Bharat / business

డిజిటల్‌ విప్లవంలో కీలక దశకు భారత్‌ - Digital-revolution news

డిజిటల్​ విప్లవంలో భారత్​ ప్రగతి బాటలో పయనిస్తూ కీలక దశకు చేరుకుందని ఒమిడియార్​ నెట్​వర్క్​ ఇండియా నివేదించింది. డిజిటలీకరణలో ప్రపంచంలోనే భారత్​ గొప్ప ఉదాహరణగా నిలిచినట్లు పేర్కొంది.

Digital-revolution
డిజిటల్‌ విప్లవంలో కీలక దశకు భారత్‌

By

Published : Aug 29, 2020, 3:46 PM IST

భారత్‌ గత పదేళ్లుగా డిజిటల్‌ విప్లవంలో ప్రగతి బాటలో పయనిస్తోందని.. ఈ ప్రయాణం ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని ఒమిడియార్‌ నెట్‌వర్క్‌ ఇండియా నివేదికలో వెల్లడించింది. డిజిటలీకరణలో ప్రపంచంలోనే భారత్‌ గొప్ప ఉదాహరణగా నిలిచినట్లు పేర్కొంది. డిజిటల్‌ సొల్యూషన్స్‌ భారీ ఎత్తున సమాజంపై ప్రభావం చూపుతున్నాయని, సాంకేతికేతర అంశాలను సరైన దారిలోకి తేవడమే ఇప్పుడు కీలకమని సూచించింది. డిజిటల్‌ ఇండియాకు తరువాతి హద్దు అయిన ఓపెన్‌ డిజిటల్‌ ఎకోసిస్టమ్స్‌ (ఓడీఈలు) గురించి కన్సల్టింగ్‌ సంస్థ బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) వివరించింది.

భారత్‌లో ఫారాలు డౌన్‌లోడ్‌ చేయడం, దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌లో చూసుకోవడం వంటివాటితో మొదలైన డిజిటల్‌ విప్లవం ఇప్పుడు పన్నులు ఆన్‌లైన్‌లో చెల్లించడం, సంక్షేమ పథకాల ఆర్థికసాయాన్ని పొందడం స్థాయికి చేరింది. ఇప్పుడు మనం ఓ కొత్త మైలురాయి వద్ద ఉన్నాం. డిజిటల్‌ వసతుల రూపకల్పనలో భారత్‌ ప్రపంచానికే దారి చూపుతోంది. ఓడీఈల రూపంలో సాంకేతిక వసతుల రూపకల్పన ద్వారా ఆర్థికంగా, సామాజికంగా పురోగతి సాధ్యమవుతుంది. ఎన్నో అపాయాలను, ఇబ్బందులను తొలగించవచ్చు.

- ఒమిడియార్‌ నెట్‌వర్క్‌ ఇండియా నివేదిక

సమర్థమైన పరిపాలన ఆధారంగా సమాజంలో మార్పులకు బాటలు పరిచే ఓపెన్‌, సెక్యూర్‌ డిజిటల్‌ వేదికలే ఓడీఈలు. ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన జాతీయ డిజిటల్‌ ఆరోగ్య మిషన్‌ను ఇందుకు ఉదాహరణగా నివేదిక పేర్కొంది. ఈమేరకు 2030 నాటికి ఆరోగ్యం, వ్యవసాయం, న్యాయం తదితర రంగాల్లో 10 అత్యంత ప్రాధాన్య జాతీయ ఓడీఈలు 500 బిలియన్‌ డాలర్లకుపైగా కొత్త ఆర్థిక విలువను చేకూరుస్తాయని, 200 బిలియన్‌ డాలర్లకుపైగా పొదుపు చేస్తాయని అంచనా వేసింది.

ఇదీ చూడండి: '93శాతం 'లోకలైజేషన్'కు దగ్గరవుతున్నాం'డిజిటల్‌ విప్లవానికి కొత్త ఊపిరి

ABOUT THE AUTHOR

...view details