ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత చెత్త పనితీరు కలిగి ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలు సమస్య పరిష్కారానికి ఏమాత్రం సరిపోవని అభిప్రాయం వ్యక్తం చేశారు. అల్పాదాయ వర్గాలకు నేరుగా నగదు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేనందున.. వారి వినియోగ వ్యయం పెరిగేందుకు ఉద్దీపన చర్యలు దోహదం చేయవని చెప్పారు.
'చెత్త పనితీరు కలిగిన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి'
ప్రస్తుతం అత్యంత చెత్త పనితీరు కలిగిన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. కరోనాకు ముందే దేశ ఆర్థిక వృద్ధి మందగించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు సమస్య పరిష్కారానికి ఏమాత్రం సరిపోవన్నారు. అయితే జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి పుంజుకుంటుందని అంచనా వేశారు.
ఓ వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడిన అభిజిత్.. దేశ ఆర్థిక వృద్ధి కరోనాకు ముందే మందగించిందని స్పష్టం చేశారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని అంచనా వేశారు. 2021లో వృద్ధి రేటు మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం భారీగా డిమాండ్‌ను సృష్టిచడం వల్ల వృద్ధితో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతోందని అన్నారు అభిజిత్. 20 ఏళ్ల పాటు భారత్‌లో అధిక వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం ఉందని తెలిపారు. ఈ సమయంలో స్థిరమైన ద్రవ్యోల్బణం ఉండటం వల్ల భారత్‌కు ఎంతో మేలు కలిగిందని చెప్పారు. అయితే అంతర్జాతీయంగా భారత్ మరింత పోటీతత్వంతో ముందుకెళ్లాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.