తెలంగాణ

telangana

ETV Bharat / business

'డిజిటల్​ లావాదేవీల్లో చైనాను దాటేసిన భారత్'​

మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల పెరుగుదలతో ఆర్థిక సమ్మిళిత కొలమానాల్లో భారత్‌ సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న చైనాను ఈ కొలమానాల్లో భారత్‌ దాటినట్లు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఎస్​బీఐ)(SBI Survey On Finance) ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌ నేతృత్వంలోని బృందం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

sbi Report
ఎస్​బీఐ కీలక సర్వే

By

Published : Nov 8, 2021, 9:04 PM IST

భారత్‌లో పెద్ద నోట్లను రద్దు చేసి సోమవారం(నవంబరు8)తో ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలో ఆర్థిక సేవల అందుబాటు, బ్యాంకు ఖాతాల సంఖ్యపై భారతీయ స్టేట్‌ బ్యాంకు(ఎస్​బీఐ)(SBI Survey On Finance) ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌ నేతృత్వంలోని బృందం రూపొందించిన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది.

మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ లావాదేవీల పెరుగుదలతో ఆర్థిక సమ్మిళిత కొలమానాల్లో భారత్.. చైనాను అధిగమించినట్లు ఈ నివేదిక తెలిపింది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • 2015లో దేశంలో మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్​ లావాదేవీలు ప్రతి వెయ్యి మందికి 183 ఉండగా, 2020లో ఆ సంఖ్య 13,615కు పెరిగింది.
  • 2015లో ప్రతి లక్ష మంది జనాభాకు బ్యాంకు శాఖలు 13.6 శాతం ఉండగా, 2020లో ఆ సంఖ్య 14.7 శాతానికి పెరిగింది.
  • చైనా, జర్మనీ, దక్షిణాఫ్రికా కంటే కూడా ఈ సంఖ్య ఎక్కువ
  • ఆర్థిక సేవలు ఎక్కువ మందికి అందుబాటులోకి రావటం, బ్యాంకు ఖాతాలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో మద్యం, పొగాకు వినియోగంతో పాటు నేరాలు కూడా తగ్గాయి.
  • గత ఏడేళ్లలో నిర్ణీత మొత్తం కంటే తక్కువ నగదు ఉండడం లేదా అసలు నగదు లేకున్నా కొనసాగించే ఖాతాలు భారీగా పెరిగాయి.
  • 2021 అక్టోబర్‌ 20 నాటికి ఈ- బ్యాంకు ఖాతాల సంఖ్య 43.7 కోట్లకు పెరిగి ఒక లక్షా 46వేల కోట్ల రూపాయల నగదు వాటిల్లో జమ అయింది.
  • ఈ ఖాతాల్లో మూడింట రెండొంతులు గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ తరహా ఖాతాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 78 శాతం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 18.2 శాతం, ప్రైవేటు బ్యాంకుల్లో 3శాతం ఉన్నాయి.
  • 2010 మార్చిలో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు 33,378 ఉండగా.. 2020 డిసెంబర్‌లో ఆ సంఖ్య 55,073కు చేరింది.

గత ఏడేళ్లలో భారత గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించే కేంద్రాలు కూడా పెరిగాయని నివేదికలో వెల్లడైంది.

ఇదీ చూడండి:డేటా అయిపోయిందా? ఛార్జీలు లేకుండా లోన్ తీసుకోండిలా..

ABOUT THE AUTHOR

...view details