తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎఫ్​డీఐల ఆకర్షణలో 9వ స్థానానికి భారత్​!

2019లో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (51 బిలియన్ డాలర్లు) ఆకర్షించిన తొమ్మిదో దేశంగా భారత్​ నిలిచిందని ఐరాస వాణిజ్య సంస్థ యూఎన్​సీటీఏడీ నివేదిక పేర్కొంది. 2020లో భారత్ వృద్ధి మందగించినప్పటికీ.. ఎఫ్​డీఐలను మాత్రం​ ఆకర్షించే అవకాశముందని తెలిపింది.

India 9th largest recipient of FDI in 2019, will continue to attract investments: UN
ఎఫ్​డీఐల ఆకర్షణలో 9వ స్థానంలో భారత్​

By

Published : Jun 16, 2020, 5:12 PM IST

2019లో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్​డీఐ) ఆకర్షించిన దేశాల జాబితాలో భారత్​ తొమ్మిదో స్థానంలో నిలిచిందని ఐరాసకు చెందిన 'కాన్ఫరెన్స్ ఆన్​ ట్రేడ్​ అండ్​ డెవలప్​మెంట్'​ (యూఎన్​సీటీఏడీ) నివేదిక పేర్కొంది. ఆసియాలో అయితే ఎఫ్​డీఐల ఆకర్షణలో భారత్​ ఐదో స్థానంలో ఉందని స్పష్టం చేసింది.

సానుకూల వృద్ధి!

2018లో 42 బిలియన్ డాలర్ల ఎఫ్​డీఐలతో 12వ స్థానంలో ఉన్న భారత్​.. 2019లో 51 బిలియన్ డాలర్ల ఎఫ్​డీఐలను ఆకర్షించగలిగిందని యూఎన్​సీటీఏడీ తెలిపింది. కరోనా ప్రభావం ధాటికి 2020లో ప్రపంచవ్యాప్తంగా ఎఫ్​డీఐలు 40 శాతం మేర తగ్గే అవకాశముందని అంచనా వేసింది.

కరోనా కారణంగా భారత ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ... దేశంలోనికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కొనసాగుతాయని నివేదిక పేర్కొంది. మొత్తానికి సానుకూల వృద్ధి దిశగా భారత్ పయనిస్తుందని వెల్లడించింది.

ఇదీ చూడండి:12 రోజుల్లో రూ.16 వేల కోట్ల ఎంఎస్​ఎంఈ రుణాలు

ABOUT THE AUTHOR

...view details