తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకింగ్​ రంగంలో మోసాలు పెరిగాయి: ఆర్​బీఐ

దేశంలో ఏర్పడిన ఆర్థిక మందగమనం తరచూ వచ్చేదేనని అభిప్రాయపడింది భారత రిజర్వు​ బ్యాంకు. గురువారం విడుదల చేసిన ఆర్బీఐ వార్షిక నివేదికలో బ్యాంకింగ్​ వ్యవస్థలో మోసాలు పెరిగినట్లు వెల్లడించింది. ప్రభుత్వ విధానాల్లో ప్రైవేటు పెట్టుబడులకు అధిక ప్రాధాన్యం ఉండాలని తెలిపింది.

By

Published : Aug 30, 2019, 6:32 AM IST

Updated : Sep 28, 2019, 8:00 PM IST

బ్యాంకింగ్​ రంగంలో మోసాలు పెరిగాయి: ఆర్బీఐ

దేశంలో ఏర్పడిన ఆర్థిక మందగమనంపై వార్షిక నివేదికలో స్పష్టతనిచ్చింది భారత రిజర్వు బ్యాంక్.​ దేశంలో ఏర్పడిన ఆర్థిక మందగమనం తరుచూ వచ్చేదేనని స్పష్టం చేసింది. ప్రైవేటు పెట్టుబడులు, వినియోగం అధికంగా ఉండేలా విధానాలు తయారుకావాలని అభిప్రాయపడింది.

15 శాతం పెరిగిన ఆర్థిక మోసాలు..

బ్యాంకింగ్ వ‌్యవస్థలో మోసాలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 15 శాతం పెరిగాయని ఆర్​బీఐ తెలిపింది. మోసాల మొత్తం విలువ 73.8 శాతం పెరిగిందని పేర్కొంది. 2018-19లో 71,542 కోట్ల రూపాయల విలువైన 6,801 మోసాలు జరిగాయని ఆర్​బీఐ పేర్కొంది. అంతకముందు సంవత్సరంలో 41,167 కోట్ల రూపాయల విలువైన 5,916 మోసాలు నమోదైనట్లు తెలిపింది.

డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నా ఈ ఏడాది మార్చి వరకు దేశంలో చలామణీలో ఉన్న నగదు 17 శాతం పెరిగి 21.10 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది ఆర్​బీఐ. చలామణీలో ఉన్న మొత్తం నగదులో 51 శాతం 500 రూపాయల నోట్లేనని వివరించింది.

ఇదీ చూడండి:'కశ్మీర్​పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు పాక్​ మానుకోవాలి'​

Last Updated : Sep 28, 2019, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details