తెలంగాణ

telangana

ETV Bharat / business

చైనాకు పెరిగిన ఇంజినీరింగ్​ ఎగుమతులు - భారత్​ ఇంజినీరింగ్​ ఉత్పత్తుల

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​- ఫిబ్రవరిలో చైనాకు భారత్​ ఇంజినీరింగ్​ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగాయని పరిశ్రమల సంఘం ఇంజినీరింగ్​ ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ కౌన్సిల్​(ఈఈపీసీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత ఇంజినీరింగ్​ ఉత్పత్తులకు చైనా, సింగపూర్​, జర్మనీ, థాయిలాండ్​, ఇటలీ దేశాల్లో మంచి గిరాకీ ఉన్నట్లు పేర్కొంది.

Increased India engineering products exports to China
చైనాకు పెరిగిన ఇంజినీరింగ్​ ఎగుమతులు

By

Published : Mar 28, 2021, 8:39 AM IST

ఎలక్రానిక్స్​ వంటి ఫినిష్డ్​ వస్తువుల కోసం చైనా నుంచి దిగుమతులపై భారత్​ అధికంగా ఆధారపడి ఉందని అందరూ భావిస్తారు. చైనాకు ముడి ఇనుము ఎగుమతి చేయడంలో భారత్​ ముందంజలో ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​- ఫిబ్రవరిలో ఇంజినీరింగ్​ ఉత్పత్తుల ఎగుమతులు ఏకంగా 114 శాతం వృద్ధి చెందాయని పరిశ్రమ సంఘం ఇంజినీరింగ్​ ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ కౌన్సిల్​(ఈఈపీసీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అగ్రగామి 25 విపణులకు భారత్​ ఇంజినీరింగ్​ ఎగుమతుల వాటా దేశ మొత్తం ఇంజినీరింగ్​ ఎగుమతుల్లో నాలుగింట మూడొంతులు పైగానే ఉన్నాయి. సంప్రదాయ మార్కెట్లపై భారత ఎగుమతిదార్లు ఆధారపడుతుండటాన్ని ఇది సూచిస్తోంది.

ఆ దేశాల్లో మంచి గిరాకీ

భారత ఇంజినీరింగ్​ ఉత్పత్తులకు చైనా, సింగపూర్​, జర్మనీ, థాయిలాండ్​, ఇటలీ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో చైనాకు ఎగుమతుల్లో సానుకూల వృద్ధి నమోదైంది. గత నెలలో చైనాకు పంపిన ఎగుమతులు 68 శాతం పెరిగి 235.58 మిలియన్​ డాలర్లకు చేరాయి. ఇక ఏప్రిల్​ నుంచి ఫిబ్రవరి వరకు చూస్తే, 114 శాతం పెరిగి 4.28బిలియన్​ డాలర్లు గా నమోదయ్యాయి. ఈఈపీసీ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..

  • చైనాకు ఇంజినీరింగ్​ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదైనప్పటికీ.. భారత్​ నుంచి అత్యధికంగా ఇంజినీరింగ్​ ఉత్పత్తులు ఎగుమతి అవుతోంది అమెరికాకే.
  • అయితే 2020-21 మొదటి 11 నెలల్లో అమెరికాకు పంపిన ఇంజినీరింగ్​ ఎగుమతులు తగ్గాయి. ప్రపంచ దేశాలకు భారత్​ నుంచి అత్యధికంగా ఇంజినీరింగ్ వస్తువులు వెళుతున్నాయి. ఆ తర్వాత స్థానంలో శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి. విదేశీ మారకంలో ఇవి ప్రధాన వనరుగా ఉన్నాయి.

ఫిబ్రవరిలో ఎగుమతులు తగ్గడానికి బేస్​ ఎఫెక్ట్​​ కారణమని, గతేడాది ఇదే నెలలో ఇవి భారీగా పెరిగాయని ఈఈపీసీ ఇండియా ఛైర్మన్​ మహేశ్​ దేశాయ్​ ఈటీవీ భారత్​కు తెలిపారు.

ఇదీ చూడండి:'టీకా ఉత్పత్తిని పెంచేందుకు నిధులివ్వండి!'

ABOUT THE AUTHOR

...view details