మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో ఎలాంటి మార్పుల లేవని తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే వీటికి సంబంధించి కొన్ని కీలక మార్పులను సూచించింది ఆర్థిక శాఖ. కొత్త సంవత్సరంలో(ఏప్రిల్ 1 నుంచి) వర్తించే మార్పులు ఏంటో తెలుసుకుందాం.
- ఆదాయపు పన్ను విభాగం 1 ఏప్రిల్ 2021 నుంచి ఐటీఆర్‌లలో నింపాల్సిన సెక్షన్ల జాబితాను మరింత పెంచింది. దీంతో పన్ను చెల్లింపుదారులు తన జీతం, టీడీఎస్, వడ్డీ, డివిడెండ్ మీద వచ్చే ఆదాయం, లిస్టెడ్ సెక్యురిటీల నుంచి మూలధన లాభాలను కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది.
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 2.5 లక్షలకు పైగా ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేస్తే వారు పన్ను పరిధిలోకి వస్తారని కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ 2021-22గాను ప్రతిపాదించిన బడ్జెట్లో ప్రకటించారు.
- 75 ఏళ్లు పైబడిన వారికి ఐటీఆర్ దాఖలు నుంచి మినహాయింపు లభించనుంది. అయితే వారు పెన్షన్, వడ్డీ ఆదాయాన్ని ఒకే బ్యాంక్ నుంచి పొందాల్సి ఉంటుంది. లేకపోతే వారికి మినహాయింపు లభించకపోవచ్చు. అంతేగాక మరే ఇతర ఆదాయ మార్గాలు ఉన్నాకానీ వారు అర్హులు కాదు.
- 2021 ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్ విధానంలోనూ మరికొన్ని మార్పులు రానున్నాయి. కొత్తగా చేర్చిన 206 ఏబీ, 206సీసీఏతో... ఐటీఆర్ దాఖలు చేయని వారు రెండేళ్లలో రూ.50వేలు అంత కంటే ఎక్కువ టీడీఎస్ లేదా టీసీఎస్ కలిగి ఉంటే వారు కనీసం 5% చెల్లించాల్సి ఉంటుంది.
- ఎల్‌టీసీ నగదు ఓచర్ పథకం: ఎల్‌టీసీ స్థానంలో ఎల్‌టీసీ నగదు ఓచర్ పథకాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం. దీని కింద ఉద్యోగులు వారు కొనుగోలు చేసి వస్తువులను/సేవలకు మినహాయింపులు ఉంటాయి. అయితే ఇది ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ పథకం కింద లబ్ధి పొందటానికి నిర్ణీత తేదీ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
- పాత పన్ను విధానానికి బదులుగా కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే సౌకర్యం రానుంది. కొత్త విధానాన్ని కేంద్రం గతేడాది నుంచి అమలు చేస్తోంది. అయితే ఏప్రిల్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు వారికి ఇష్టం వచ్చిన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు.