తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీఆర్ ఫైల్ చేశాక రిఫండ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి? - ఆర్థిక మంత్రి

మీరు ఇప్పటికే ఐటీఆర్ దాఖలు చేశారా? అయితే మీరు కట్టిన పన్ను/ టీడీఎస్​ కట్టవలసిన పన్ను కంటే ఎక్కువ ఉంటే కచ్చితంగా రిఫండ్​కు అర్హులు అవుతారు. మరి ఆ రిఫండ్​ స్టేటస్​ ఎలా తెలుసుకోవాలి?

ఐటీఆర్ ఫైల్ చేశాక రిఫండ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?

By

Published : Aug 4, 2019, 5:12 AM IST

మీరు ఐటీఆర్​ దాఖలు చేశారా? రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!

సాధారణంగా ఆదాయ పన్ను రిటర్న్​ వెరిఫికేషన్ పూర్తయ్యాక రిఫండ్ ప్రక్రియ మొదలవుతుంది. గతంలోలా ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు చెక్కులు జారీచేయడం లేదు. మీకు రావల్సిన రిఫండ్​ నేరుగా మీరు సూచించిన బ్యాంకు ఖాతాలో జమవుతుంది. అయితే... ఇందుకోసం మీ బ్యాంకు ఖాతాను పాన్​కార్డుకు లింక్ చేయడం తప్పనిసరి. మరి రిఫండ్​ స్టేటస్ తెలుసుకోవడం ఎలా అంటారా?

మీరు రిఫండ్​ స్టేటస్ సులభంగా తెలుసుకోగలరు. ఇందుకోసం ఈ విధంగా చేయండి.

1. ముందుగా https://www.incometaxindiaefiling.gov.in వెబ్​సైట్​లో మీ యూజర్ ఐడీ, పాస్​వర్డ్​తో లాగిన్ అవ్వండి.

2. వ్యూ రిటర్న్స్ అండ్ ఫామ్స్​​ పై క్లిక్​ చేయండి.

3. ఇన్​కమ్​ టాక్స్ రిటర్న్స్​ ఆప్షన్​ క్లిక్​ చేయండి.

4. మీ రిటర్న్స్​కు సంబంధించిన ఆర్థిక సంవత్సరాన్ని సెలెక్ట్ చేయండి.

మీ రిఫండ్​ మీ బ్యాంకు ఖాతాలోకి జమ అయినట్లైతే 'రిఫండ్​ పెయిడ్​' అని చూపిస్తుంది. ఇలా చూపించాక కూడా మీ ఖాతాలో డబ్బు జమకాకపోతే మీ బ్యాంకును లేదా రిఫండ్ క్లెయిమ్​ ప్రోసెస్​ చేసే ఎస్​బీఐని సంప్రదించవచ్చు. ఆదాయ పన్ను శాఖ వారికీ ఫిర్యాదు చేయవచ్చు. ఒక వేళ ఇంకా ప్రాసెసింగ్​లో ఉన్నట్లయితే స్టేటస్​ 'ఈ- వెరిఫైడ్​'​ అని మాత్రమే చూపిస్తుంది.

మరో మార్గమూ ఉంది

రిఫండ్ స్టేటస్​ తెలుసుకోవడానికి మరో మార్గమూ ఉంది. ఈ కింది లింక్​ క్లిక్​ చేసి, మీ పాన్​ నెంబర్ ఎంటర్ చేయండి, ఆర్థిక సంవత్సరం ఎంచుకోండి.

https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. రిఫండ్​పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా రిఫండ్​... బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు బడ్జెట్​ సందర్భంగా చెప్పారు.

ఇదీ చూడండి: జియో గిగాఫైబర్​ 'ఫిషింగ్​ మెయిల్స్'​తో జరభద్రం!

ABOUT THE AUTHOR

...view details