'మన దేశంలో పదేళ్ల క్రితం ద్విచక్ర వాహన విపణి ఉన్న స్థితిలో ప్రస్తుతం కార్ల విభాగం ఉంది. కారు అనేది విలాసం నుంచి అవసరంగా మారింది. ఇప్పుడు కారు మార్చే వారి కంటే తొలిసారి కారు కొనేవారే అధికం. వీరు చిన్న కార్లవైపే చూస్తున్నారు. చిన్న పట్టణాల నుంచి గిరాకీ పెరుగుతోంది' అని రెనో ఇండియా ఆపరేషన్స్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లె వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో రెనో కైగర్‌ను వినియోగదారులకు అందించిన ఆయన 'ఈనాడు'తో మాట్లాడారు.
? ప్రారంభ విభాగ కార్లలో పోటీ ఎలా ఉంది? కొత్త మోడళ్లు తీసుకొస్తున్నారా
బిలియనీర్ల క్లబ్‌లోకి మరో 40 మంది భారతీయులు
కారు కొనాలనే ఆలోచన ఇటీవల చాలామందిలో పెరిగింది. వీరంతా అందుబాటు ధరలో లభించే 'ఎంట్రీ లెవల్' కార్లనే చూస్తున్నారు. అందుకే వీటి అమ్మకాలు దూసుకెళ్తున్నాయి. మాకు ఈ విభాగంలో క్విడ్ ఉంది. ప్రస్తుతానికి క్విడ్‌లోనే పలు మార్పులు చేస్తున్నాం. ఈ విభాగంలోఇప్పటికే ఉన్న మోడళ్లలోనే అనేక వేరియెంట్లు తెచ్చేందుకు అవకాశం ఉంది.
? విద్యుత్ వాహనాలపై మీ వ్యూహమేంటి
ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉంటే నష్టాలివే...
గత ఏడాది ఆటో షోలోనే మా క్విడ్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించాం. అయితే మన దేశం విద్యుత్ కార్ల వినియోగానికి ఇంకా సిద్ధం కాలేదు. ఛార్జింగ్‌తో పాటు ఇతర మౌలిక వసతులు విద్యుత్తు ద్విచక్ర వాహనాలకే అంతంతమాత్రంగా ఉన్నాయి. కార్లకు అనుగుణంగా ఇ-వ్యవస్థ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందేందుకు కనీసం 3-4 ఏళ్లు పడుతుంది. కేవలం ఛార్జింగ్ స్టేషన్లే సరిపోవు. కారులో బ్యాటరీలు ఉంటాయి.. ప్రమాదం సంభవిస్తే, వాటికి నష్టం కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఛార్జింగ్ చేసే విద్యుత్‌లో నాణ్యత వంటి ఎన్నో అంశాలుంటాయి.
? కొవిడ్ పరిస్థితులు పూర్తిగా కుదుటపడ్డాయని భావించవచ్చా
ఆండ్రాయిడ్ యూజర్లకు ట్విట్టర్ మరో ఫీచర్
కార్ల అమ్మకాలు ఇప్పుడు 2019 స్థాయికి చేరాయి. 2021-22లో 30 లక్షల ప్రయాణికుల కార్లు అమ్ముడవుతాయని అంచనా. ఇందులో 15లక్షల వరకూ ఎస్‌యూవీలు ఉంటాయి. ఈ గణాంకాలను సాధిస్తేనే కార్ల పరిశ్రమ కోలుకుందని అర్థం చేసుకోవాలి. కొవిడ్ తర్వాత చాలామంది తమ సొంత ప్రాంతాలకు వెళ్లారు. వారు కొత్త కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పెరుగుతోంది. ఇప్పుడున్న విక్రయాలన్నీ తొలిసారి కార్లు కొనేవారి నుంచి వస్తున్నవే. కార్లను మార్పిడి చేసే వారు తగ్గిపోయారు. ఇంటి నుంచి పని తగ్గి, కార్యాలయాలకు వెళ్లడం ప్రారంభించినప్పుడు అమ్మకాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. పదేళ్ల క్రితం ద్విచక్రవాహనాల మార్కెట్‌ను ఇప్పుడు కార్ల మార్కెట్ ప్రతిబింబిస్తోంది.