తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆఫీస్‌కు రావాలంటే 'ఆరోగ్యసేతు' ఉండాల్సిందే! - Indian Govt news

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రతి ఒక్కరూ యాప్‌ను వాడాలని సూచించిన కేంద్రం.. దాని ఆధారంగానే కార్యాలయాలకు రాకపోకలు సాగించాలని పేర్కొంది.

Aarogya Setu app
ఆఫీస్‌కు రావాలంటే 'ఆరోగ్యోసేతు' ఉండాల్సిందే!

By

Published : Apr 29, 2020, 6:27 PM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 'ఆరోగ్యసేతు' యాప్ ఉపయోగించాలని కేంద్రం ఆదేశించింది. దేశవ్యాప్తంగా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రోజూ ఈ యాప్‌ ద్వారా తమ ఆరోగ్య సమాచారాన్ని పరీక్షించుకోవాలని సూచించింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

'సేఫ్‌' అని వస్తేనే..

ఉద్యోగులు తమ కార్యాలయాలకు బయలుదేరే ముందు 'ఆరోగ్య సేతు' యాప్‌లో వివరాలు నమోదుచేసుకొని వారి ఆరోగ్య పరిస్థితి సమీక్షించుకోవాలి. ఆ సమయంలో బ్లూటూత్‌, జీపీఎస్ సాయంతో తమ సమీప ప్రాంత సమాచారాన్ని ఆ యాప్‌ విశ్లేషిస్తుంది. అనంతరం 'సేఫ్' అని సూచిస్తేనే ఆ ఉద్యోగి కార్యాలయానికి బయలుదేరాలి. సమీప కాలంలో కరోనా సోకిన వ్యక్తితో కలిసి మాట్లాడితే మాత్రం తీవ్రతను బట్టి మోడరేట్‌, హై రిస్క్‌ అని సూచిస్తుంది. ఇలాంటివారు అధికారులకు సమాచారం ఇవ్వడం సహా 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశాలు జారీచేసింది సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది.

రికార్డు స్థాయి డౌన్‌లోడ్స్‌

కరోనా కట్టడిలో ఆరోగ్య సేతుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ ఉద్యోగులను తప్పనిసరిగా ఈ యాప్‌ను వాడాలని సూచించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఈ యాప్‌ వినియోగం పెరిగింది.

ఇదీ చదవండి:'ఆరోగ్య సేతు' యాప్​తో కరోనాకు దూరంగా ఉండండి!

ABOUT THE AUTHOR

...view details