మహ్మమారితో పోరాడుతున్న ప్రపంచ దేశాలకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం చేయనునట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ డైరెక్టర్ జనరల్ క్రిస్టాలినా జార్జివా తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు మద్దతుగా 1 ట్రిలియన్ డాలర్లతో రుణ సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. వైరస్ను ఎదుర్కోవడానికి.. 189 ఐఎంఎఫ్ సభ్యదేశాల్లో 102 దేశాలు రుణ సహాయాన్ని అర్థిస్తున్నట్లు క్రిస్టాలినా చెప్పారు.
"మహా మాంద్యం తర్వాత ఎన్నడు లేనివిధంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం. ప్రపంచ జీడీపీ వృద్ధిరేటు 3 శాతం క్షీణించనుంది. 170 దేశాల్లో తలసరి ఆదాయం భారీగా తగ్గిపోనుంది. మూడు నెలల క్రితం ఊహించిన దాని కంటే ఇది అధికం." - క్రిస్టాలినా జార్జివా, ఐఎంఎఫ్ డైరెక్టర్ జనరల్