ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును స్వల్పంగా తగ్గిస్తూ.... అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) అంచనాలను సవరించింది. 2019లో ప్రపంచ వృద్ధిరేటు 2.9 శాతం, 2020లో 3.3 శాతం, 2021లో 3.4 శాతం తగ్గనున్నట్లు అంచనా వేసింది.
ప్రపంచ ఆర్థిక సమాఖ్య వార్షిక సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో... ఆర్థిక వృద్ధి మళ్లీ మందగమనం బాట పడితే తక్షణమే తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని ఐఎంఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివా సూచించారు. వాణిజ్య వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించిన సవాళ్లు ఉన్నప్పటికీ, మధ్యప్రాచ్యంలో అభివృద్ధి కనిపిస్తోందని వెల్లడించారు.
అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో అక్టోబర్ నుంచి కొన్ని సమస్యలు తగ్గినట్లు IMF చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు.