తెలంగాణ

telangana

ETV Bharat / business

'రెండో డోసు తీసుకున్న ఆరు నెలలకు బూస్టర్​ డోసు!' - Bharat Biotech new

కొవిడ్ వ్యాక్సిన్​ రెండో డోసు అందుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకునేందుకు అనువైన సమయం అని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. నాజల్​ వ్యాక్సిన్​ను బూస్టర్​ డోసుగా ఇచ్చే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Bharat Biotech MD Krishna Ella
భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల

By

Published : Nov 10, 2021, 5:12 PM IST

కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్​​ డోసు తీసుకోవడానికి అనువైన సమయమని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల(Krishna Ella) పేర్కొన్నారు. ఈ క్రమంలో ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ను (నాజల్‌ వ్యాక్సిన్‌)​​ బూస్టర్​ డోసుగా అందించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. కొవాగ్జిన్​తో పోలిస్తే దీని ఉత్పత్తి సులభంగా ఉంటుందన్నారు.

నాజల్‌ వ్యాక్సిన్‌ ప్రాముఖ్యతను వివరించిన కృష్ణ ఎల్ల.. ప్రపంచ దేశాలు దీనివైపు వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. వైరస్​ వ్యాప్తిని అరికట్టడానికి ఇదొక్కటే మార్గమన్నారు.

"మేము నాజల్​ వ్యాక్సిన్‌తో అభివృద్ధి చేశాం. కొవాగ్జిన్​ను తొలి డోసుగా ఇచ్చి.. రెండో డోసుకు నాజల్​ వ్యాక్సిన్​ ఇవ్వవచ్చు. ఇది వ్యూహాత్మకంగా, శాస్త్రీయంగా చాలా ముఖ్యమైనది. నాజల్​ను రెండో డోసుగా అందిస్తే.. వైరస్ వ్యాప్తిని ఆపవచ్చు."

- భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల

జికా టీకా ​సిద్ధం!

మరోవైపు జికా వ్యాక్సిన్​ గురించిన మాట్లాడిన ఎల్ల.. ప్రపంచంలోనే తొలిసారిగా జికా వైరస్​కు భారత్​ బయోటెక్..​ టీకాను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. జికా వ్యాక్సిన్‌తో భారత్ బయోటెక్ సిద్ధంగా ఉందన్నారు. తొలి దశ క్లినికల్​ ట్రయల్స్​​ పూర్తయినట్లు తెలిపిన ఆయన.. ప్రస్తుతం జికా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ట్రయల్స్​కు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సూచించారు.

కొవాగ్జిన్​కు హాంకాంగ్​ గుర్తింపు

హాంకాంగ్​.. తన దేశం ఆమోదించిన కరోనా టీకా జాబితాలో కొవాగ్జిన్​ను చేర్చింది. కొవాగ్జిన్​ టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ఆమోదం తెలిపిన వారం రోజులకే హాంకాంగ్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

కొవాక్సిన్​, కొవిషీల్డ్‌లను ఇప్పటివరకు 96 దేశాలు గుర్తించాయి. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, బ్రిటన్​, ఫ్రాన్స్​, జర్మనీ, బెల్జియం, రష్యా, స్విట్జర్లాండ్​ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఇదీ చూడండి:కొవాగ్జిన్ కాల పరిమితి 12 నెలలకు పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details