వినియోగదారులకు ఐసీఐసీఐ చేదు వార్త చెప్పింది. బ్యాంకు పనివేళలు మించిన తర్వాత, సెలవు దినాల్లో డిపాజిట్ యంత్రం ద్వారా నగదు డిపాజిట్ చేసేందుకు రూ. 50 ఛార్జీ వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.
పనివేళలకు మించి నగదు డిపాజిట్ చేయాలంటే ఛార్జీ - icici bank deposit charges
బ్యాంకు పనివేళలు మించిన తర్వాత డిపాజిట్ యంత్రం ద్వారా నగదు డిపాజిట్ చేసేందుకు రూ. 50 ఛార్జీ వసూలు చేస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ఈ నెల 1 నుంచి నిబంధన అమలులోకి వచ్చినట్లు పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ ఆగస్టు నుంచే ఇలాంటి ఛార్జీ వసూలు చేస్తోంది.

పనివేళలకు మించి నగదు డిపాజిట్ చేయాలంటే ఛార్జీ
పనివేళల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, బ్యాంకు సెలవు దినాల్లో ఈ ఛార్జీ అమలవుతుంది. బ్యాంక్ పనివేళల్లో చెల్లించాల్సిన అవసరం ఉండదు. యాక్సిస్ బ్యాంక్ ఆగస్టు నుంచే ఇలాంటి రుసుము విధిస్తోంది.