తెలంగాణ

telangana

By

Published : Jan 21, 2020, 7:05 PM IST

Updated : Feb 17, 2020, 9:35 PM IST

ETV Bharat / business

ఇకపై కార్డ్​ లేకుండానే ఏటీఎం నుంచి నగదు విత్​డ్రా

ఐసీఐసీఐ బ్యాంకు తన ఏటీఎంలలో కార్డు రహిత నగదు ఉపసంహరణ సదుపాయాన్ని ఇవాళ ప్రారంభించింది. రోజువారీ లావాదేవీ పరిమితిని రూ.20,000గా నిర్ణయించింది. ఐ-మొబైల్ యాప్ ఉపయోగించి వినియోగదారులు ఈ సేవలు పొందవచ్చని స్పష్టం చేసింది.

ICICI Bank introduces cardless cash withdrawal facility through ATMs
ఇకపై కార్డ్​ లేకుండానే ఏటీఎం నుంచి నగదు విత్​డ్రా

ఏటీఎంల ద్వారా కార్డ్​లెస్ నగదు ఉపసంహరణ సదుపాయాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ప్రారంభించింది. రోజువారీ లావాదేవీ పరిమితిని రూ.20,000గా నిర్ణయించింది.

దేశంలోని ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన 15,000 ఏటీఎంలలో కార్డ్ రహిత నగదు ఉపసంహరణ సేవలను పొందవచ్చు. ఇందుకోసం మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఐ-మొబైల్​ ఉపయోగించాలి.

"డెబిట్ కార్డు ఉపయోగించకుండా నగదు ఉపసంహరించుకోవడానికి ఇది సరళమైన, అనుకూలమైన మార్గం."
- ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటన

సాంకేతిక పరిజ్ఞానంపై, ఆవిష్కరణలపై తమ బ్యాంకు దృష్టి సారిస్తుందని, వినియోగదారులకు మరింత సౌలభ్యం కలిగించడమే తమ ధ్యేయమని ఐసీఐసీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్​ బాగ్చి పేర్కొన్నారు.

2019 సెప్టెంబర్​ 30 నాటికి ఐసీఐసీఐ బ్యాంకు మొత్తం ఆస్తుల విలువ రూ.12,88,190 కోట్లుగా ఉంది. ఈ ప్రైవేటు రంగ బ్యాంకు మొత్తం 15 దేశాల్లో సేవలు అందిస్తోంది.

ఇదీ చూడండి: వాట్సాప్​ నయా రికార్డ్​- 500 కోట్లు దాటిన డౌన్​లోడ్స్​

Last Updated : Feb 17, 2020, 9:35 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details