గతేడాది కొవిడ్ లాక్డౌన్ దృష్ట్యా విధించిన మారటోరియం కాలానికి.. వివిధ రుణాలపై చక్రవడ్డీ మాఫీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బ్యాంకులపై పడిన భారాన్ని తొలగించేందుకు సహకరించాలని భారతీయ బ్యాంకుల సంఘం.. ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది.
రూ.2 కోట్లకు పైగా ఉన్న రుణాలపై చక్ర వడ్డీని మాఫీ చేయాలని సుప్రీంకోర్టు గతేడాది నవంబర్లో తీర్పునిచ్చింది. దశల వారీగా దీనిని అమలు చేసేందుకు వివిధ బ్యాంకులు సమయాత్తమవుతున్నాయి.
"సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాఫీ చేస్తే.. మా బ్యాంకుపై సుమారు రూ.30 కోట్లు భారం పడుతుంది."