ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డెడ్‌లైన్ విధించారు. ఆదాయపు పన్ను విభాగం కొత్త వెబ్సైట్లో నెలకొన్న సమస్యలను సెప్టెంబర్ 15 లోపు పరిష్కరించాలని కోరారు. సంస్థ పనితీరుపై కేంద్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్‌కు స్పష్టం చేశారు.
ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణలో చిక్కులు తొలగించి, పన్ను చెల్లింపుదారులు మరింత సులభంగా వీటిని దాఖలు చేసేందుకు కేంద్రం ఈ వెబ్‌సైట్‌ను తీసుకువచ్చింది. అయితే పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు వెల్లువెత్తాయి. వాటిని సరిదిద్దే బాధ్యతను ఇన్ఫోసిస్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో రెండు నెలలు గడిచినా.. పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు అలానే కొనసాగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు కారణాలను వివరించాలని కోరింది.