తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఈ-క్యాలిక్యులేటర్'​తో మీ పన్ను ఎంతో తెలుసుకోండి

ఆదాయపన్ను చెల్లింపుల్లో మార్పులు తీసుకొస్తున్నట్లు బడ్జెట్​ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలిపింది కేంద్రం. ఇందు కోసం రెండు విధానాలను ప్రవేశపెట్టింది. కొత్త, పాత విధానాల ద్వారా ఎంత పన్ను కట్టాలో తెలుసుకునేందుకు 'ఈ- కాలిక్యులేటర్​'ను విడుదల చేసింది.

I-T Dept launches e-calculator to compare due tax under new, old regime
కొత్త, పాత విధానాల్లో పన్ను ఎంతో తెలుసుకోండి

By

Published : Feb 7, 2020, 6:48 AM IST

Updated : Feb 29, 2020, 11:49 AM IST

ఆదాయపు పన్ను చెల్లింపుల్లో రెండు విధానాలు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త, పాత విధానాల ద్వారా ఎంత పన్ను కట్టాలో సరిచూసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ ఈ-కాలిక్యులేటర్‌ను విడుదల చేసింది. దీని ద్వారా కొత్త విధానంలో ఎంత కట్టాలో.. పాత విధానమైతే ఎంత కట్టాలో చెల్లింపుదారులు పోల్చుకునేందుకు వీలుంటుంది.

ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌...

పాత, కొత్త విధానాల ద్వారా పన్నులను సరిపోల్చుకునేందుకు టేబుల్‌తో కూడిన ఈ-కాలిక్యులేటర్‌ను ఐటీ ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఐటీ శాఖ అధికారులు గురువారం వెల్లడించారు. వ్యక్తులు లేదా సంస్థలు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తారు. పాత విధానంలో ఎంత ఆదాయానికి పన్ను చెల్లించాలి.. కొత్త విధానానికి మారితే ఎంత పన్ను తగ్గుతుంది తదితర వివరాలను ఈ కాలిక్యులేటర్‌తో తెలుసుకోవచ్చు. బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ కాలిక్యులేటర్‌ను తయారుచేశారు.

మెలిక పెట్టిన కేంద్రం..

ఆదాయపు పన్ను శ్లాబులను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటన చేసింది. అయితే అదే సమయంలో పాత విధానమూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంతేగాక, కొత్త శ్లాబులను వాడుకుంటే ఎలాంటి మినహాయింపులు వర్తించబోవంటూ ఓ మెలిక కూడా పెట్టింది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ప్రస్తుతం 100కు పైగా మినహాయింపులు ఉండగా.. కొత్త విధానంలో వీటిల్లో దాదాపు 70కి పైగా తొలగించినట్లు వెల్లడించింది. దీంతో ఏ విధానం మేలు చేస్తుందనేది ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చూడండి: బంగారానికి మళ్లీ రెక్కలు- నేటి ధరలు ఇవే...

Last Updated : Feb 29, 2020, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details