తెలంగాణ

telangana

ETV Bharat / business

నగదు నిల్వల్లో అక్రమాలు.. దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు - brokers and traders operating at the Bombay Stock Exchange

నగదు నిల్వల్లో అక్రమాలు చేస్తున్నారన్న ఆరోపణలతో.. దేశంలోని 39 ప్రాంతాల్లో షేర్​ బ్రోకర్లు, వ్యాపారులపై ఈ నెల 3న దాడులు నిర్వహించారు ఆదాయపన్ను శాఖ అధికారులు. ఈ మేరకు భారత ఐటీ శాఖ ఇవాళ ఓ ప్రకటన వెలువరించింది.

i-t-dept-conducts-searches-at-39-locations-to-check-tax-evasion-by-bse-brokers-traders
నగదు నిల్వల్లో అక్రమాలు.. దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు

By

Published : Dec 7, 2019, 10:23 PM IST

ఆదాయపన్ను శాఖ అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డిసెంబర్​ 3న సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. నగదు నిల్వల్లో అక్రమాలు చేస్తున్నారన్న ఆరోపణలతో దేశంలోని 39 ప్రాంతాల్లో షేర్‌ బ్రోకర్లు, వ్యాపారులపై దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి భారత ఐటీ శాఖ ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ముంబయి, కోల్‌కతా, కాన్పుర్‌, దిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌, హైదరాబాద్‌, ఘజియాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు జరిగినట్లు తెలిపింది. కృత్రిమ లాభ, నష్టాల కోసం బ్రోకర్లు అతి తక్కువ సమయంలో రివర్స్‌ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ వివాదాస్పద పద్దతి ద్వారా పలు యోగ్యత లేని సంస్థలు దాదాపు రూ.3500 కోట్లకు పైగా లాభ, నష్టాలను పొందాయని ఐటీ విభాగం అంచనా వేసింది.

ఈ సోదాల్లో అధికారులు.. లెక్కల్లో నమోదు చేయని దాదాపు రూ.1.20 కోట్ల నగదును సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి లావాదేవీల ద్వారా ప్రయోజనం పొందేవారు దేశవ్యాప్తంగా కొన్ని వేల సంఖ్యలో ఉండొచ్చని.. వారిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details