సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో స్థాయి నుంచి ఆ కంపెనీకి ఛైర్మన్‌గా ఎదగటం హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీతో పాటు దేశానికే గర్వకారణంగా నిలిచారని హైదరాబాద్ ఐటీ అసోసియేషన్ - హైసియా అధ్యక్షులు భరణి కుమార్ అరోల్ అన్నారు. సీఈవోగా అనేక సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి ఎదగటం ఆసాంతం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
'సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా ఎదగటం దేశానికే గర్వకారణం' - telangana varthalu
సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ కావడం దేశానికే గర్వకారణమని హైసియా అధ్యక్షులు భరణి కుమార్ అరోల్ అన్నారు. అనేక సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి ఎదగటం స్పూర్తిదాయకమన్నారు.
'సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా ఎదగటం దేశానికే గర్వకారణం'
ఆయన వృత్తిరీత్యా ఎదుగుదలతో పాటు కంపెనీను కూడా సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా మైక్రోసాఫ్ట్‌ను సత్యనాదెళ్ల తీర్చిదిద్దారని తెలిపారు. దీర్ఘదృష్టి ప్రణాళికలు, సాహసోపేత నిర్ణయాలే ఆయన విజయానికి కారణమని భరణి కొనియాడారు.
ఇదీ చదవండి: Satya Nadella: సత్య జర్నీ చెబుతోందేంటి?