తెలంగాణ

telangana

ETV Bharat / business

స్థిరాస్తి ధరల వృద్ధిలో వరల్డ్​ నెం.14గా హైదరాబాద్ - హైదరాబాద్​లో పెరుగుతున్న ఇళ్ల ధరలు

'నైట్​ ఫ్రాంక్' సంస్థ ఇళ్ల ధరల పెరుగుదలపై చేసిన సర్వేలో హైదరాబాద్​ ప్రపంచంలోనే 14వ స్థానంలో నిలిచింది. హంగేరీలోని బుడాపెస్ట్ మొదటి స్థానంలో, చైనాలోని జియాన్, వుహాన్​ 2,3 స్థానాల్లో నిలిచాయి.

Hyderabad ranks 14th globally in housing price appreciation
స్థిరాస్తి ధరల వృద్ధిలో వరల్డ్​ నెం.14గా హైదరాబాద్

By

Published : Jan 21, 2020, 5:43 PM IST

Updated : Feb 17, 2020, 9:22 PM IST

ప్రాపర్టీ కన్సల్టెంట్​ నైట్​ ఫ్రాంక్ ఇళ్ల ధరల పెరుగుదలపై ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో హైదరాబాద్ 14వ స్థానంలో నిలిచింది. గతేడాది జులై-సెప్టెంబర్​ల మధ్య భాగ్యనగరంలో ఇళ్ల ధరలు సుమారు 9 శాతం పెరిగాయని సర్వే లెక్కగట్టింది.

ఏకైక భారత నగరం

నివాస స్థిరాస్తి​ ధరల పెరుగుదలపరంగా చూస్తే.. టాప్​ 20లో చోటుదక్కించుకున్న ఏకైక భారతీయ నగరం హైదరాబాద్​ అని నైట్​ఫ్రాంక్​ తెలిపింది. దీని తరువాత 3.2 శాతం గృహ ధరల పెరుగుదలతో దిల్లీ 73వ స్థానంలో ఉండగా, 2 శాతం పెరుగుదలతో బెంగళూరు 94వ స్థానంలో, 1.1 శాతం గృహ ధరల పెరుగుదలతో అహ్మదాబాద్ 108వ స్థానంలో ఉన్నాయి.

2 శాతం గృహ ధర క్షీణతతో కోల్​కతా 130వ స్థానంలో, 3 శాతం ధర క్షీణతతో 135, 136 స్థానాల్లో వరుసగా ముంబయి, చెన్నై నిలిచాయి.

కారణమిదే..

గత నాలుగేళ్లలో.. భారత్​లోని మొదటి ఎనిమిది నగరాల్లో నివాసాల ధరల పెరుగుదల రిటైల్​ ద్రవ్యోల్బణం కంటే తక్కువగా ఉంది. 2016 నుంచి ఈ అంతరం క్రమంగా పెరుగుతోందని నైట్​ ఫ్రాంక్ పేర్కొంది. అయితే హైదరాబాద్​ ఒక్కటి మాత్రమే రిటైల్​ ద్రవ్యోల్బణ స్థాయి కంటే అధికంగా ఇళ్ల ధరల పెరుగుతున్న నగరంగా ఉందని స్పష్టం చేసింది.

హైదరాబద్​లో ఇప్పటికే నిర్మాణమై సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోలుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారని, బేరమాడడానికి అవకాశం ఉండడమూ దీనికి దోహదం చేస్తోందని నైట్​ ఫ్రాంక్ తెలిపింది.

బుడాపెస్ట్​- నెం.1

హంగేరీలోని బుడాపెస్ట్ నగరం అత్యధిక వార్షిక వృద్ధిరేటు 24 శాతంతో... 'గ్లోబర్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్​ క్యూ-3, 2019'లో ముందుంది. చైనాలోని జియాన్​, వుహాన్​ వరుసగా 15.9 శాతం, 14.9 శాతంతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

నైట్​ ఫ్రాంక్ చేసిన సర్వేలో 150 నగరాల్లో 78 శాతానికి పైగా.. 12 నెలల కాలంలో (ఇళ్ల ధరలు) ఫ్లాట్​గా లేదా ​పెరుగుతున్న ధరలను నమోదుచేశాయి. మొత్తంగా చూసుకుంటే ఈ 150 నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 3.2 శాతానికి పెరిగాయి. 2015 రెండో త్రైమాసికం తరువాత ఇదే అత్యంత బలహీనమైన వార్షిక రేటు.

ఇదీ చూడండి: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు- నేటి లెక్కలివే...

Last Updated : Feb 17, 2020, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details