తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆసియాలోనే అగ్రగామి లైఫ్‌ సైన్సెస్‌ గమ్యస్థానంగా హైదరాబాద్‌

వచ్చే పదేళ్లలో హైదరాబాద్‌ను ఆసియాలోనే అగ్రగామి లైఫ్‌ సైన్సెస్‌ గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో ముందుకు సాగుతామని సర్కార్‌ తెలిపింది. తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ విజన్- 2030 నివేదికను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్... పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధిలో ఫార్మారంగం ప్రభుత్వ ప్రాధాన్యతా రంగంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో 50 బిలియన్ డాలర్ల క్లస్టర్ రెవెన్యూ సహా 100 బిలియన్ డాలర్ల ఎకో సిస్టంను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.

ఆసియాలోనే అగ్రగామి లైఫ్‌ సైన్సెస్‌ గమ్యస్థానంగా హైదరాబాద్‌
ఆసియాలోనే అగ్రగామి లైఫ్‌ సైన్సెస్‌ గమ్యస్థానంగా హైదరాబాద్‌

By

Published : Nov 4, 2020, 5:05 AM IST

ఆసియాలోనే అగ్రగామి లైఫ్‌ సైన్సెస్‌ గమ్యస్థానంగా హైదరాబాద్‌

ఆసియాలోనే ప్రధాన లైఫ్ సెన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా నిలపాలని సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం విషయ నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సతీశ్​ రెడ్డి సారథ్యంలోని ఈ కమిటీ అందరిని సంప్రదించి నివేదికను రూపొందించింది. ఇప్పటికే దేశంలో 30 శాతం వాటాతో అతిపెద్ద లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్‌గా ఉన్న రాష్ట్రం నుంచి ఫార్మా రంగంలో రూ. 350 కోట్ల డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయి.

ఆసియాలో ప్రధాన క్లస్టర్‌...

ఫార్మాసూటికల్స్, బయో టెక్నాలజీ, మెడికల్ డివైజెస్‌ను కలిపి లైఫ్‌ సైన్సెస్‌ విభాగంగా పరిగణిస్తారు. ఇన్నోవేషన్ ఆధారంగా, సాంకేతికతో కూడిన వృద్ధితో పాటు దేశీయ డిమాండ్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఆసియాలో ప్రధాన క్లస్టర్‌గా మారవచ్చని తెలిపింది. ఇందుకోసం ప్రస్తుతం 12.8 బిలియన్ డాలర్లుగా ఉన్న లైఫ్‌ సైన్సెస్‌ రంగం 50 బిలియన్ డాలర్ల క్లస్టర్ రెవెన్యూకు చేరుకోవాల్సి ఉందని, అందుకు 2020-30 మధ్య 15 శాతం వార్షిక వృద్ధి సాధించాలని నిర్దేశించింది.

పరిశోధన కేంద్రాలు...

ప్రపంచ టాప్ 10 కంపెనీల్లో 3 నుంచి 5 కంపెనీల అభివృద్ధి, పరిశోధన కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేసేలా చూడాలని వెల్లడించింది. ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి, పర్యవేక్షణ కోసం ఓ మంచి వ్యవస్థను తీసుకొచ్చి క్లినికల్ పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయాలని పేర్కొంది. నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపింది.

ప్రోత్సాహక వ్యవస్థ...

ఈ నివేదిక ప్రకారం ఇన్నోవేషన్‌కు సంబంధించి తెలంగాణలో లైఫ్ సైన్సెస్‌కు సంబంధించిన అంకురాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆపరేషన్స్, దేశీయ పరిశ్రమ నిరాటంక కార్యకలాపాల నిర్వహణతో పాటు లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో రాష్ట్రానికి పెట్టుబడి ప్రోత్సాహక వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంది.

లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్‌గా తెలంగాణ...

ఆసియాలోనే ప్రధానమైన లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్‌గా తెలంగాణ మారేందుకు అవకాశాలున్నాయని నివేదిక తెలిపింది. దేశంలోనే ప్రత్యేకమైన జినోమ్ వ్యాలీ, ఫార్మా సిటీ, మెడ్‌టెక్ పార్కు లాంటివి ఉన్నాయని ప్రస్తావించింది. ఇప్పటికే హైదరాబాద్‌ను వ్యాక్సిన్ హబ్ ఆఫ్ ఇండియాగా పరిగణిస్తారని సూచించింది. భారత వ్యాక్సిన్ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 33 శాతం, ప్రపంచ వ్యాక్సిన్ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 30 శాతంగా పేర్కొంది.

రాష్ట్రం నుంచే...

పలు వ్యాక్సిన్‌లు తెలంగాణ నుంచే దేశానికి అందాయి. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రోటా వైరస్, జపనీస్ ఎన్‌సిఫలైటీస్ లాంటివి ఇక్కడే అభివృద్ధి అయ్యాయి. కళాశాలు, విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని, టాప్ 10 ప్రపంచ సంస్థల్లో ఏడు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నాలుగేళ్లలో దాదాపు రూ. 10, 500 కోట్ల పెట్టుబడులు డ్రగ్స్ అండ్ ఫార్మాలో వచ్చాయని రిపోర్టు తెలిపింది.

ఇప్పటికే అతిపెద్ద క్లస్టర్‌గా ఉన్న తెలంగాణ... భవిష్యత్తులో ఆసియాలో ప్రధాన క్లస్టర్‌గా మారేందుకు అవకాశాలున్నాయని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details