తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆరు రోజుల నష్టాలకు బ్రేక్- వారాంతంలో బుల్​ జోరు - నిఫ్టీ

అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లలో వారాంతంలో బుల్ జోరు కొనసాగింది. ఆరు రోజుల నష్టాలకు చెక్​ పెడుతూ.. సెన్సెక్స్ 835 పాయింట్లు బలపడి 37 వేల 400 మార్క్​కు చేరువైంది. నిఫ్టీ 245 పాయింట్లు పెరిగి.. తిరిగి 11 వేల స్థాయిని దక్కించుకుంది.

share Markets today
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Sep 25, 2020, 3:48 PM IST

Updated : Sep 25, 2020, 5:49 PM IST

ఆరు రోజుల నష్టాల నుంచి వారాంతంలో తేరుకున్నాయి స్టాక్ మార్కెట్లు. శుక్రవారం సెషన్​లో బీఎస్ఈ-సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 835 పాయింట్లు పెరిగి.. 37,389 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 245 పాయింట్ల లాభంతో11,050 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు, బిహార్​ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మదుపరులు భారీగా కొనుగోళ్లకు దిగటం లాభాలకు కారణంగా తెలుస్తోంది.

నేడు మార్కెట్లు సాగిందిలా..

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 37,471 పాయింట్ల అత్యధిక స్థాయి, 36,730 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,073 పాయింట్ల గరిష్ఠ స్థాయి;10,855 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

30 షేర్ల ఇండెక్స్​లో ఇన్ని కంపెనీలు లాభాలను నమోదు చేయడం గమనార్హం.

బజాజ్ ఫిన్​సర్వ్, హెచ్​సీఎల్​టెక్​, భారతీ ఎయిర్​టెల్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎల్​&టీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

ఆసియా మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన టోక్యో, సియోల్ సూచీలు శుక్రవారం లాభపడ్డాయి. షాంఘై, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి శుక్రవారం 28 పైసలు పెరిగింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.61 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.31 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 42.07 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:డెంగ్యూ వ్యాక్సిన్​ అభివృద్ధిలో పురోగతి.. త్వరలో మార్కెట్లోకి‌!

Last Updated : Sep 25, 2020, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details