తెలంగాణ

telangana

ETV Bharat / business

వాట్సాప్​, టెలిగ్రామ్​లకు ఆదాయం ఎలా? - సామాజిక మాధ్యమాలు

వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్​లు వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు తీసుకోవు. అందులో ప్రకటనలు కూడా రావు. ఈ ఉచిత మెసేజింగ్ సేవల వల్ల వాటికి లాభమేంటి? రోజు వారీ కార్యకలాపాల కోసం కావాల్సిన నిధులు ఏ విధంగా సమకూరుతాయి?

Whatsapp, telegram
వాట్సాప్​, టెలిగ్రామ్​

By

Published : Jul 1, 2021, 7:39 PM IST

ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ భాగమైపోయింది. అందులో వాట్సాప్ అనేది తప్పనిసరి అయిపోయింది. వాట్సాప్​కు పోటీనిచ్చే టెలిగ్రామ్ కూడా ఇటీవల కాలంలో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. రెండు ఉచిత ఇన్​స్టంట్ మేసేజింగ్ సేవలను అందిస్తున్నాయి. ఒకటి వాట్సాప్ అమెరికాకు చెందిన సామాజిక మాధ్యమ కంపెనీ ఫేస్​బుక్​కు చెందినది. టెలిగ్రామ్ రష్యాకు చెందినవారు ప్రారంభించారు.

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్​కు దాదాపు 150 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. టెలిగ్రామ్​కు 50 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇవి రెండు ఎలాంటి ప్రకటనలు ఇవ్వవు. ప్రకటనలు ఉండకూడదన్న ఉద్దేశంతో వాట్సాప్​ను మొదలు పెట్టారు ఆ యాప్ వ్యవస్థాపకులు. వాట్సాప్​కు పోటీనివ్వాలన్న ఉద్దేశంతో రష్యన్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం వీకే వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో టెలిగ్రామ్ ప్రారంభమైంది. వాట్సాప్ కంటే పలు అదనపు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఆదాయం ఎలా?

ప్రస్తుతానికి రెండు యాప్​లకు ఎలాంటి ఆదాయం లేదు. ప్రకటనలు ఉండరాదన్న ఉద్దేశంతో ప్రారంభించిన దృష్ట్యా వినియోగదారులు భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రకటనల వైపు ఆలోచన చేయలేదు. వాట్సాప్ కొన్ని రోజులు వార్షిక సబ్​స్క్రిప్షన్​ ఫీజుతో పెయిడ్ వర్షన్ కూడా తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి అది లేదు. టెలిగ్రామ్.. వ్యవస్థాపకుల సొంత ఫండింగ్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే ఉద్యోగుల జీతం, ఇతర ఖర్చుల కోసం.. ఒక డాలరు వార్షిక ఫీజుతో యాప్​ను తీసుకొచ్చింది. మొదటగా 2.5 లక్షల డాలర్లు మొదటి ఫండింగ్ పొందింది. రెండు, మూడో రౌండ్​లో 6 కోట్ల డాలర్లు ఫండింగ్ పొందింది. 19 బిలియన్ డాలర్లకు వాట్సాప్​ను 2014లో కొనుగోలు చేసిన ఫేస్​బుక్.. వార్షిక ఛార్జీని తొలగించింది.

ఆదాయం లేకపోయినప్పటికీ వాట్సాప్ ఆ దిశగా ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకుంది. ఇందులో 2018 జనవరిలో వాట్సాప్ బిజనెస్​ను విడుదల చేసింది. ఇందులో వాట్సాప్ బిజినెస్ యాప్ చిన్న కంపెనీల కోసం తీసుకొచ్చింది. ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్ పెద్ద కంపెనీల కోసం తీసుకొచ్చింది. వాట్సాప్ బిజినెస్​లో చిన్న వ్యాపారులకు సంబంధించి ఆటోమేటిక్ రిప్లై, ఆర్డర్ స్టేటస్ తదితర టూల్స్​ను పొందుపరిచింది.

యూపీఐ ఆధారిత పేమెంట్స్ సంబంధించిన సేవలను కూడా వాట్సాప్ పరిమిత స్థాయిలో ప్రారంభించింది. 2020 అక్టోబర్​లో వాట్సాప్ బిజినెస్​కు సంబంధించి ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.

వాట్సాప్ ద్వారా రాబడి పెంచుకునేందుకు 2021 జనవరిలో కొత్త ప్రైవసీ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ ద్వారా వాట్సాప్ యూజర్ డేటాను ఫేస్​బుక్​తో పంచుకునే వీలు ఉంది. కొత్త పాలసీ ప్రకారం తప్పకుండా కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించాల్సి ఉంది. దీనిపై విమర్శలు రావటంతో దీని అమలును వాయిదా వేసుకుంది.

వాట్సాప్ స్టేటస్​లలో ప్రకటనలకు అవకాశం

ప్రకటనలు లేకుండా వాట్సాప్ అనుభూతి ఉండాలనుకున్నప్పటికీ.. మానిటైజేషన్ కోసం ప్రకటనలు ఇవ్వాలని ఫేస్​బుక్ ప్రయత్నిస్తున్నట్లు పలు మీడియా కథనాలు వచ్చాయి. స్టేటస్ ద్వారా ప్రకటనలు రానున్నాయనేది వీటి సారాంశం. దీనిపై చర్చ జరిగినప్పటికీ.. ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు.

ఇదీ చూడండి:ఛార్జీలు లేవ్.. మరి జీపే, పేటీఎంకు ఆదాయం ఎలా?

'ఓటీటీ'లకు ఆదాయం ఎలా వస్తుంది?

ABOUT THE AUTHOR

...view details