తెలంగాణ

telangana

ETV Bharat / business

టైప్​ చేయకుండానే వాట్సాప్​ మెసేజ్​.. ఇలా పంపండి - వాట్సాప్​లో టైప్​ చేయకుండానే మెసేజ్​

మనం తీరికలేని పనిలో ఉంటాం. ముఖ్యమైన మెసేజ్‌లు వస్తుంటాయి. వాటికి రిప్లయ్‌ ఇవ్వక తప్పదు. ఇలాంటి సందర్భాల్లో పనిచేసుకుంటూనే వాట్సాప్ మెసేజ్‌లను పంపొచ్చు. అదెలాగంటే..?

without typing message in whatsapp
వాట్సాప్​ ట్రిక్స్​

By

Published : Aug 8, 2021, 8:22 PM IST

మెసేజింగ్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాక సమాచార మార్పిడి మరింత సులభతరమైంది. ఇందుకు ఉదాహరణే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న వాట్సాప్. ఇందులో మనం పంపాలకున్న సమాచారాన్ని టెక్ట్స్, ఆడియో, వీడియో రూపంలో ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఎక్కువ మందికి టెక్ట్స్ మెసేజ్‌ పంపేందుకు టైప్‌ చేయాలంటే కొంచెం కష్టపడాల్సిందే.

ఒకవేళ మీరు టైప్ చేయకుండా ఆ పని కూడా వర్చువల్ అసిస్టెంట్ చేస్తే? ఆ ఆలోచన ఎంత బావుంది కదూ! ఇప్పటికే మనం చెప్పే మాటల్ని టెక్ట్స్‌ రూపంలోకి మార్చే ఎన్నో రకాల థర్డ్‌ పార్టీ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటికి బదులు మనం రోజూ ఉపయోగించే వాట్సాప్‌ నుంచి టైప్ చేయకుండా టెక్ట్స్‌ మెసేజ్‌లను పంపొచ్చు. అదేలాగో తెలుసుకుందాం.

  • ముందుగా ఆండ్రాయిడ్ యూజర్స్ గూగుల్ అసిస్టెంట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని మీ జీమెయిల్‌తో లాగిన్ కావాలి.
  • తర్వాత మీరు 'ఓకే గూగుల్' లేదా 'హేయ్ గూగుల్' అని ఫోన్ మైక్ వద్ద పిలిస్తే గూగుల్ అసిస్టెంట్ ఆన్ అవుతుంది.
  • అలానే మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఫోన్‌ లాక్‌లో కూడా గూగుల్‌ అసిస్టెంట్ పనిచేసేందుకు అనుమతివ్వాలి.
  • అలా మీరు గూగుల్ అసిస్టెంట్‌ను హేయ్‌ గూగుల్/ఓకే గూగుల్ అని పిలిచి 'సెండ్ ఏ వాట్సాప్‌ మెసేజ్‌ టు.. (మీరు ఎవరికి పంపాలనుకుంటున్నారో వారి పేరు)' అని చెప్పాలి.
  • తర్వాత మెసేజ్‌లో ఏం టైప్ చేయమంటారు అని గూగుల్ అసిస్టెంట్ మిమ్మల్ని అడుగుతుంది.
  • మీరు పంపాలనుకుంటున్న సమాచారం చెప్తే దాన్ని టైప్ చేసి మీకు చూపిస్తుంది. తర్వాత మీరు మెసేజ్ చూసి 'ఓకే సెండ్ ఇట్' అని చెప్తే మీ మెసేజ్ అవతలి వారికి వెళ్లిపోతుంది.

ఇలా మీరు టైప్ చేయకుండానే సులభంగా మెసేజ్‌లు పంపొచ్చు.

ఇదీ చూడండి:వాట్సాప్​ కొత్త ఫీచర్​.. అవి ఒక్కసారి మాత్రమే

ఇదీ చూడండి:వాట్సాప్​ మెసేజ్​ బుక్​మార్క్.. మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details