పదవీ విరమణ తర్వాత జీవితం సాఫీగా సాగాలని అందరూ కోరుకుంటారు. అయితే, చాలా మంది ఆ దిశగా విజయం సాధించలేరు. కారణం.. రిటైర్మెంట్‌కు ముందు సేవింగ్స్ గురించి ఆలోచించకపోవడమే. కొంత మందికి దాని గురించి ఆలోచన ఉన్నప్పటికీ.. పరిస్థితులు సహకరించవు. పిల్లల చదువు, గృహ రుణాలతో పాటు ఇతర లోన్లు కట్టిన తర్వాతే రిటైర్మెంట్ ప్లాన్ల వద్దకు వస్తారు.
రిటైర్మెంట్ కార్పస్‌ను తయారు చేసుకోవాలంటే మొదటి నుంచి సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రణాళిక లేని వారితో పాటు తక్కువ రిటైర్మెంట్ కార్పస్ ఉన్న వారు కొన్ని చర్యలు తీసుకోవటం ముఖ్యమని సూచిస్తున్నారు. త్వరగా రిటైర్మెంట్ కావాలనుకుంటున్న వారికి కూడా ఈ అంశాలు పనికొస్తాయని అంటున్నారు. అవేంటో చూద్దాం..
ఆదాయాన్ని పెంచుకోవటం..
కొత్త ఉద్యోగంలో చేరి ఆదాయాన్ని పెంచుకోవటం ఒక మార్గమైతే.. ఉన్న కంపెనీలోనే జీతాల పెంపుతో ఎక్కువ పొదుపు చేసుకోవచ్చు. లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా రిటైర్మెంట్‌కు కావాల్సిన మొత్తం త్వరగా చేకూరుతుంది. అప్పుడు త్వరగా రిటైర్ కావొచ్చు. రిటైర్మెంట్ తీసుకున్నట్లయితే.. తక్కువ వేతనాన్ని ఇచ్చే పార్ట్ టైం ఉద్యోగం అయినా ఖర్చులకు ఉపయోగపడుతుంది. తద్వారా పోర్ట్‌ఫోలియో నుంచి పెట్టుబడి ఉపసంహరణ తగ్గి.. పెట్టుబడులు మరింత ఎక్కువ కాలం కొనసాగుతాయి.
రిటైర్మెంట్ సమయం సమీపిస్తుంటే.. అందుకు కావాల్సిన మొత్తాన్ని సరిపడా సమకూర్చుకోని వారు ఆదాయాన్ని పెంచుకోవటం కానీ లేదా పొదుపును పెంచుకోవటం కానీ చేయాలి. పిల్లల చదువులు, గృహ రుణం కూడా పూర్తైన సందర్భంలో ఇంకా ఉద్యోగం చేస్తున్నట్లయితే.. వారికి సాధారణంగా పొదుపు చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే అత్యధిక వేతనం పొందే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వారు రిటైర్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచించాలని... రిటైర్మెంట్ తర్వాత కూడా సాధారణ జీవితం గడిపేందుకు పోర్ట్‌ఫోలియోను తయారు చేసుకుంటూ ఉండాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఖర్చులు తగ్గించుకోవటం..