తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంక్ పేరుతో వ‌చ్చే ఫేక్ మెసేజ్‌ల‌ను ఇలా గుర్తించండి! - బ్యాంక్​ మెసేజ్​లు

బ్యాంక్​ల నుంచి తరచూ మనకు చాలా మెసేజ్​లు వస్తాయి. మన ఖాతాలో డబ్బులు పడినప్పుడు, మనం విత్​డ్రా చేసినప్పుడు.. ఇలా చాలా సందర్భాల్లో చూస్తాం. కానీ అప్పుడప్పుడు కొన్ని మెసేజ్​లు అచ్చం బ్యాంక్​ వాళ్లు పంపినట్లే వస్తాయి. వాటిలో ఒక లింక్​ ఉంటుంది. వాటిని పొరపాటున క్లిక్​ చేసి అడిగిన వివరాలు ఇస్తే.. ఇంక అంతే సంగతులు. మరి వాటికి దూరంగా ఉండటం ఎలా? అలాంటి వాటిని గుర్తించడం ఎలా? అనేది తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే

How to identify a fake message from bank name
బ్యాంక్ పేరుతో వ‌చ్చే ఫేక్ మెసేజ్‌ల‌ను ఇలా గుర్తించండి!

By

Published : Jan 22, 2021, 10:22 AM IST

బ్యాంకులు వివిధ మీడియా ఛాన‌ళ్ల ద్వారా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ప్ప‌టికీ బ్యాంకింగ్ మోసాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి మోసాలను గురించి ఖాతాదారులు తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం, ఖాతాదారుడు శ్ర‌ద్ధ‌గా, అవ‌గాహ‌న‌తో వ్య‌వ‌హ‌రిస్తే బ్యాంకింగ్ మోసాల‌ను చాలా వ‌ర‌కు నివారించ‌వ‌చ్చ‌ని బ్యాంకింగ్ ప‌రిశ్ర‌మ నిపుణులు చెబుతున్నారు. ఈ ర‌క‌మైన మోసాల గురించి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ త‌మ ఖాతాదారుల‌కు మూడు చిట్కాల‌తో కూడిన మెయిల్‌ను పంపించింది. మోసాల‌కు పాల్ప‌డే వారు ఖాతాదారుల మొబైల్ ఫోన్ల‌కు ఏవిధంగా మోస‌పూరిత సందేశాల‌ను బ్యాంక్ పేరుతో పంపుతారో ఇందులో స‌వివ‌రంగా తెలియ‌జేసింది.

మోసాగాళ్లు ఈ కింది విధంగా బ్యాంక్ పేరుతో మోస‌పూరిత సందేశాల‌ను పంపిస్తారు..

ఫేక్ మెసేజ్‌-1:

మీ కేవైసీ విజ‌య‌వంత‌గా అప్‌డేట్ అయ్యింది. మీరు ఇప్పుడు రూ.1300 న‌గ‌దు వాప‌సు పొందేందుకు అర్హులు. న‌గ‌దు క్లెయ‌మ్ చేసేందుకు ఇక్క‌డ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి. (BP-BeanYTM: Your KYC has been successfully updated. You are now eligible for a cashback of ₹1,300. Claim your cashback visit, http://311agtr)

కేవైసీతో రివార్డ్స్ పాయింట్స్ రావ‌ని గుర్తించుకోండి. ఇది పూర్తిగా అబ‌ద్ధం. ఇక్క‌డ ఇచ్చిన లింక్‌ను చూసి కూడా ఇది ఫేక్ మెసేజ్ అని గుర్తించ‌వ‌చ్చు. అని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.

ఫేక్ మెసేజ్‌-2:

మీకు అభినంద‌న‌లు, మీ ఖాతాలో రూ.3,30,000 జ‌మ‌య్యాయి. ఈ కింది లింక్‌ను క్లిక్ చేసి మీ వివ‌రాల‌ను ఇవ్వండి. ( Y-Cash: Congratulations, your account has been credited with ₹3,30,000. Please fill in your details at http://i2urewards. cc/33 to process it.) అని ఫేక్ మేసేజ్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఏ సంస్థ కూడా ఉచితంగా ఇంత మొత్తంలో డ‌బ్బును జ‌మ‌చేయ‌దు. ఇందుకోసం మీ వివ‌రాల‌ను కూడా కోర‌రు. ఇది ఖ‌చ్చితంగా ఫేక్ మెసేజ్‌ని గుర్తించుకోండి.

ఫేక్ మెసేజ్‌-3:

మీ ఐటీ రిఫండ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యింది. క్లెయిమ్ చేసేందుకు నేడే చివ‌రి రోజు (Fake Message 3 from sender 8726112@vz.com: Your IT Refund has been initiated. Today is the last day to claim it. Visit http://itr.trn./toref) ఈ విధంగా వ‌చ్చిన మేసేజ్ ఫేక్ అని గుర్తించండి.

తొంద‌ర‌పెట్టే, ప్ర‌శ్న‌ర్థ‌క ఐడీలు, లింకులు ప‌ట్ల జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి. వీటిని మోస‌గాళ్ళు పంపిస్తారు. బ్యాంకు మిమ్మ‌ల్ని యూజ‌ర్ ఐడి, పాస్‌వ‌ర్డ్ త‌దిత‌ర‌ వివ‌రాల‌ను అడ‌గ‌దని గుర్తించుకోండి.

ఇదీ చూడండి: 'సానుకూల వృద్ధికి అత్యంత చేరువలో భారత్'

ABOUT THE AUTHOR

...view details