తెలంగాణ

telangana

ETV Bharat / business

సోషల్ మీడియా సెలబ్రిటీల సంపాదన ఎంతో తెలుసా? - YouTube star buvan bam comedy

ఫేస్​బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక ఏదైనా కానీ.. పక్కా ఎంటర్​టైన్​మెంట్​కు ఇవి కేరాఫ్ అడ్రస్​. అయితే.. మనం కొట్టే ఒక్కో లైకు, సోషల్ మీడియా సెలబ్రిటీలకు లక్షలు కురిపిస్తాయని తెలుసా? తమదైన ఎంటర్​టైన్​మెంట్​తో మనల్ని కట్టిపడేసే ఈ నయా ఇన్​ఫ్లుయెన్స్​ర్​ల సంపాదన వింటే అవాక్కవ్వాల్సిందే!

social Influencers
సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్స్

By

Published : Jul 29, 2021, 12:50 PM IST

మీ దగ్గర స్మార్ట్​ఫోన్ ఉంది. ఇన్​స్టాలో రీల్స్, యూట్యూబ్​లో షార్ట్ వీడియోస్ చూస్తూ గంటల గంటలు ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కొట్టే లైకులు, చేసే షేర్లు అందులో నటించే వ్యక్తులకు(ఇన్ఫ్లూయెన్సర్​) డబ్బు తెచ్చిపెడతాయని తెలుసా? నెలకు వారి సంపాదన లక్షల్లో ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా? ఒకవేళ దీని గురించి తెలియకపోతే ఈ స్టోరీ మీకోసమే. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.

క్యారీ మినాటి..

'క్యారీ మినాటి'గా నెటిజన్లకు సుపరిచితుడైన అజయ్ నగర్.. నెలకు రూ.15-20 లక్షల వరకు సంపాదిస్తాడు. వీటిలో యూట్యూబ్ ద్వారా రూ.10 లక్షలు, స్పాన్సర్​షిప్​ల ద్వారా ఇతర ఆదాయం వస్తుందని వివరించాడు.

రూ.5 వేల నుంచి కోటి..!

హాస్యనటుడు, పాటల రచయిత, గాయకుడు 'భువన్ బమ్'.. స్టాండప్ కామెడీతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మరోవైపు వివిధ బ్రాండ్లకు ప్రమోషన్ చేస్తూ, ఏడాదికి రూ.కోటికి పైగా సంపాదిస్తున్నానని బీబీసీ ఇంటర్వ్యూలో చెప్పాడు. రూ.5 వేల జీతంతో తన జీవితాన్ని మొదలుపెట్టి.. యూట్యూబ్​ ఛానల్ 'బీబీ కీ వైన్స్' ద్వారా దిల్లీకి చెందిన భువన్ స్టార్ అయ్యాడు.

కృతిక మాయ..

ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్​స్టైల్​కు సంబంధించిన పోస్టులతో యూట్యూబ్, ఇన్​స్టాగ్రామ్​లలో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది కృతిక ఖురానా. ఇన్​స్టా​లో ఒక్కో స్పాన్సర్డ్ పోస్ట్​కు రూ.90 వేల ఆదాయం వస్తుందని ఆమె ఓ ప్రకటనలో తెలిపింది. యూట్యూబ్​లో ఒక్కో వీడియో ద్వారా.. రూ.1-3 లక్షల వరకు సంపాదిస్తుంటుంది.

ఆరోగ్య మాంత్రికుడు..

'ఫ్లయింగ్ బీస్ట్​'గా పేరు తెచ్చుకున్న గౌరవ్ తనేజా అత్యంత విజయవంతమైన భారతీయ యూట్యూబర్లలో ఒకరు. పలు వ్యాయామాలు, పోషకాహారం, జీవనశైలికి సంబంధించి వీడియోలు తన ఛానెల్​లో అప్​లోడ్ చేస్తుంటారు. 5.2 మిలియన్లకు పైగా సబ్​స్క్రైబర్లు కలిగిన తనేజా.. నెలకు రూ.1.4 లక్షలు రూపాయల వరకు ఆర్జిస్తాడు.

బోర్ కిల్లర్..

లాక్​డౌన్​లో నెటిజన్లకు బోర్ కొట్టకుండా ఎప్పటికప్పుడు నూతన కంటెంట్​ను అందించింది సాక్షి శివదాసని. తన ప్రొఫెషనల్ జర్నీని వ్లాగ్స్ రూపంలో షేర్ చేసిన సాక్షి.. గతేడాది తన ఆదాయం రూ.15-20 లక్షలు అని పేర్కొంది.

ముంబైకర్..

ప్రముఖ వ్లాగర్ ముంబైకర్ నిఖిల్ ఆదాయం నెలకు రూ.15-20 లక్షలు వరకు ఉంటుందని ఓ సందర్భంలో వెల్లడించాడు.

గరిమా వ్లాగ్స్..

మనసుకు ఉల్లాసాన్ని కంటెంట్​తో ఫాలోవర్స్​ను సంపాదించుకున్న గరిమా గోయల్.. ఒక్కో వ్లోగ్​కు రూ.లక్ష వరకు సంపాదిస్తుంది. 'గరిమాస్ గుడ్ లైఫ్' యూట్యూబ్ ఛానల్ ద్వారా దైనందిన జీవితంలో జరిగే విషయాలను పంచుకుంటుందీ ఈమె.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details