ఆర్థిక ప్రణాళికలో భాగంగా మొదట చేయాల్సిన పని బడ్జెట్ వేసుకోవడం. ప్రస్తుతం మనం చెల్లింపులు చేసే మార్గాలు పెరిగాయి. ఇది వరకు అయితే ఏదైనా వస్తువును కొంటే నేరుగానే డబ్బు చెల్లించేవాళ్లం. కానీ ఇప్పుడు ద్రవ్య రూపంలో చెల్లించడంతో పాటు, నేరుగా బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ చేయడం, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, వ్యాలెట్లు ఇలా అనేక రూపాలలో చెల్లింపులు, లావాదేవీలు చేస్తున్నాం. ఇలా అన్ని మార్గాలను ట్రాక్ చేయడం కష్టం అవుతుంది.
అలాగని ఖర్చులను ట్రాక్ చేయకపోతే.. ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నామో తెలియదు. దీంతో పొదుపు తగ్గిపోయే ప్రమాదం ఉంది. పొదుపు సామర్థ్యాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే పొదుపును పెట్టుబడులకు మళ్లిస్తేనే కదా.. సంపదను సృష్టించగలుగుతాం.
పూర్వపు రోజుల్లో అయితే సంపాదించిన మొత్తాన్ని.. ఖర్చులను.. అంతా ఒక పుస్తకంలో వ్రాసి పెట్టుకునే వారు. దేనికి ఎంత వెచ్చించాలో ముందే నిర్ణయించుకునే వారు. దానికి తగినట్లు బడ్జెట్ రూపొందించుని ఖర్చు పెట్టేవారు. ఆరకంగా పొదుపు చేసిన మొత్తంతో బంగారం లేదా స్థిరాస్తులను కొనుగోలు చేసేవారు. మన అమ్మమ్మలు తాతయ్యలను ఒక్కసారి అడిగి చూడండి.. మీరు ఖర్చులను ఎలా మ్యానేజ్ చేసేవారని. వారు చెప్పే మాట ఇదే. ఇప్పుడూ అదే చేయాలి.
ఇలా ఖర్చులను డైరిలో రాసి పెట్టుకోవడం..పాత పద్ధతి కావచ్చు. కానీ బడ్జెట్ రూపొందించడం.. ఖర్చులను ట్రాక్ చేయడం మాత్రం ఎప్పటికీ చేయాల్సిందే. ఇందుకు పాత డైరి పద్దతిని అనుసరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తుంది. అందరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్‌లు ఉంటున్నాయి. వాటిలో రకరకాల యాప్‌లు (Finance Apps India) ఉంటున్నాయి. వ్యక్తిగత ఫైనాన్స్ సక్రమంగా నిర్వహించేందుకు, పలు యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఖర్చులను ట్రాక్ చేయడంలో ఇవి సహాయపడుతున్నాయి. బడ్జెట్‌ను సులభతరం చేసే అనేక ఫీచర్లు అందిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఉదాహరణకి, ఫిస్కస్ యాప్. ఫిస్కస్ అనేది అత్యంత ఆటోమేటెడ్ ఇంటర్‌ఫేస్‌తో కూడిన మనీ మేనేజ్‌మెంట్ యాప్ (Finance Apps India). ట్రాన్సేక్షన్ లెవల్‌లో ఉన్న యూజర్ బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డులు, ఇ-వాలెట్లు, ఆటో ట్రాకింగ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. యాండ్రో మనీ, మనీఫైతోపాటు మరికొన్ని యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి
బడ్జెట్ యాప్‌లు ఎలా ఉపయోగపడతాయి..?