భారత్‌లో కరోనా చికిత్సకు మరిన్ని ఔషధాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే గ్లెన్ ఫార్మా, హెటిరో, సిప్లా సంస్థలు కరోనా బాధితులకు ఉపశమనం కలిగించే కొన్ని మెడిసిన్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. తాజాగా అదే జాబితాలోకి చేరింది స్వదేశీ ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ పతంజలి. ఈ సంస్థ వారంలో కరోనా మందును దివ్య 'కరోనిల్' పేరిట మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డ్రగ్‌పై పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్-జైపుర్ సంయుక్తంగా పరిశోధనలు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హరిద్వార్‌లోని దివ్య ఫార్మసీ, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కలిసి దీన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
క్లినికల్ ట్రయల్స్‌లో 'కరోనిల్' పనితీరు?
'ఈ ఆయుర్వేద మందుపై పరిశోధనలకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి ఇవ్వగానే.. ఇండోర్, జైపుర్‌లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాం. దేశంలో కొవిడ్-19 కేసు రాగానే.. శాస్త్రవేత్తల బృందం డ్రగ్ తయారీలో నిమగ్నమైంది. కొంతమందికి పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై ఈ మందును ప్రయోగించాం. మూడు రోజుల పరిశీలనలో ఈ మందుతో 69 శాతం మందికి నెగిటివ్ వచ్చింది. అలాగే 7 రోజుల్లో 100 శాతం మంది కోలుకున్నారు. 'కరోనిల్' మాత్రల ద్వారా 5 నుంచి 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చు' అని వివరించారు పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ.
ఎలా తయారు చేశారంటే..?
గిలోయ్, అశ్వగంధ, తులసి, స్వసర్జి రసం, ప్రత్యేకమైన నూనెల మిశ్రమంతో ఈ డ్రగ్ తయారు చేశాం. ప్రతిరోజు ఈ మందును ఉదయం, సాయంత్రం సేవించాలి.
ఖరీదు ఎంత?