దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో జనవరి-మార్చి మధ్యలో ఇళ్ల విక్రయాలు సుమారు 44 శాతం పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా అనే సంస్థ తెలిపింది. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్, పుణె నగరాలు ఈ వరుసలో ముందున్నట్లు వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని తగ్గించడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 71 వేల 963 ఇళ్లు అమ్ముడైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. గతేడాదితో పోల్చితే 44 శాతం వృద్ధి చెందినట్లు వెల్లడించింది. ఇది స్థిరాస్తి మార్కెట్‌కు శుభ సూచికమన్న సంస్థ.. ఈ గణాంకాలు మరిన్ని ప్రాజెక్ట్‌లకు ఊతం ఇచ్చినట్లు పేర్కొంది.