కరోనా ప్రభావం దేశీయ రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగా పడింది. దిల్లీ ముంబై, పుణె, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై నగరాల్లో భవన నిర్మాణాలు, అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ 'అనరాక్' తన వార్షిక నివేదికలో తెలిపింది. 2019లో ఈ ఏడు నగరాల్లో 2.61లక్షల ఇళ్లు అమ్ముడవగా.. 2020లో 1.38లక్షల గృహాలు మాత్రమే విక్రయించినట్లు వెల్లడించింది.
2019లో కొత్తగా కట్టిన ఇళ్లు 2.37లక్షలు అమ్ముడవగా.. ఈ ఏడాది 46శాతం తగ్గి 1.28లక్షల అమ్మకాలు జరిగినట్టు తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే గత రెండు త్రైమాసికాల నుంచి ఇళ్లపై ప్రకటిస్తున్న డిస్కౌంట్లు, సులభతర ఈఎంఐల వెసులుబాటుతో నివాస గృహాల అమ్మకాల్లో క్రమంగా వృద్ధి నమోదవుతోందని ప్రకటించింది.
2020.. రియల్ ఎస్టేట్ రంగానికి అత్యంత గడ్డు సంవత్సరం. ప్రస్తుతం నివాస గృహాల అమ్మకాలు వేగంగా పుంజుకుంటున్నాయి. ఇది ఆశించదగిన పరిణామం.