ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశంలో గృహ విక్రయాలు (సంఖ్య పరంగా) 34 శాతం తగ్గొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. అయితే 2021-22లో మాత్రం డిమాండ్ 30 శాతం మేర పుంజుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.
రెసిడెన్సియల్ రియల్ ఎస్టేట్ రంగం వచ్చే ఆర్థిక సంవత్సరం K-ఆకారపు రికవరీని నమోదు చేసే అవకాశమున్నట్లు రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. ఈ విభాగంలో విక్రయాలు 2021-22లో(ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే) 14 శాతం తక్కుగానే నమోదుకావచ్చని పేర్కొంది. '2020-21లో ఫ్లోర్ ప్లేస్ విక్రయాలు ఏకంగా 41 శాతం తగ్గాయి. పూర్తి ఏడాదికి ఈ మొత్తం 34 శాతంగా నమోదు కావచ్చు' అని తెలిపింది.