తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇళ్ల విక్రయాలు రెండింతలు.. ధరలు 3 శాతం వృద్ధి!

కరోనా సంక్షోభం నుంచి రియల్టీ రంగం క్రమంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. అనరాక్​ ప్రాపర్టీ కన్సల్టెంట్ (Housing sales data) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జులై-సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో (Housing sales in India) ఇళ్ల విక్రయాలు రెండింతలు పెరిగినట్లు తెలిసింది. ఈ మూడు నెలల కాలంలో మొత్తం 62,800 యూనిట్లు విక్రయమైనట్లు వెల్లడైంది.

Housing sales data by Anarock
ఇళ్ల విక్రయాల్లో భారీ వృద్ధి

By

Published : Sep 29, 2021, 2:03 PM IST

దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారీగా పెరిగినట్లు (Housing sales data) ప్రాపర్టీ కన్సల్టెంట్​ సంస్థ అనరాక్ నివేదిక వెల్లడించింది. ఈ మూడు నెలల కాలంలో ఇళ్ల విక్రయాలు (Housing sales in India) రెండింతలకుపైగా పెరిగి.. 62,800 యూనిట్లకు చేరినట్లు తెలిపింది. మార్ట్​గేజ్​ రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఐటీ సేవల రంగ సంస్థల నుంచి వచ్చిన డిమాండ్ ఈ వృద్ధికి కారణంగా పేర్కొంది.

ఈ ఏడాది ఏప్రిల్​-జూన్​ త్రైమాసికంలో 24,560 యూనిట్లు, గత ఏడాది ఇదే జులై-సెప్టెంబర్ మధ్య 29,520 ఇళ్లు విక్రయమైనట్లు అనరాక్ పేర్కొంది.

ఏడు ప్రధాన నగరాల్లో.. నివాస గృహాల (Home Prices in India) ధరలు కూడా 3 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో చదరపు అడుగు స్థలం రూ.5,760గా ఉన్నట్లు తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ ధర రూ.5,600గా ఉన్నట్లు గుర్తు చేసింది.

అనరాక్ నివేదికలోని మరిన్ని విషయాలు..

  • దిల్లీ ఎన్​సీఆర్​ ప్రాంతంలో (Housing sales in Delhi) జులై-సెప్టెంబర్ మధ్య ఇళ్ల విక్రయాలు భారీగా 97శాతం పెరిగి.. 10,220 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 5,200గా ఉంది.
  • దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో (Housing sales in Mumbai) విక్రయాలు 2021 క్యూ3లో (గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే) రెండింతలకుపైగా పెరిగి.. 9,200 యూనిట్ల నుంచి 20,965 యూనిట్లకు చేరాయి.
  • బెంగళూరులో (Housing sales in Bengaluru) ఇళ్ల విక్రయాలు జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో 58శాతం వృద్ధితో 8,550 యూనిట్లకు పెరిగాయి. 2020 ఇదే సమయంలో ఈ సంఖ్య 5,400గా ఉంది.
  • పుణెలో ఇళ్ల విక్రయాలు (Housing sales in Pune) 100శాతం పెరిగాయి. గత ఏడాది జులై-సెప్టెంబర్ మధ్య 4,850 యూనిట్లు అమ్ముడవగా.. ఈ ఏడాది క్యూ3లో 9,705 ఇళ్లు విక్రయమయ్యాయి.
  • హైదరాబాద్​లో (Housing sales in Hyderabad) ఇళ్ల విక్రయాలు ఏకంగా ఆరు రెట్లు పెరిగాయి. 2021 క్యూ3లో మొత్తం 6,735 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 1,650 ఇళ్లు మాత్రమే విక్రయమయ్యాయి.
  • చెన్నైలో ఇళ్ల విక్రయాలు (Housing sales in Chennai) జులై-సెప్టెంబర్​ కాలంలో (గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే) 1600 యూనిట్ల నుంచి 3,405 యూనిట్లకు పెరిగాయి. ఈ వృద్ధి రెండు రెట్లకు పైమాటే.
  • కోల్​తాలో ఇళ్ల విక్రయాలు (Housing sales in Kolkata) 2021 క్యూ3లో (గత ఏడాదితో పోలిస్తే) 99 శాతం పెరిగాయి. ఈ కాలంలో మొత్తం 3,220 యూనిట్లు విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 1,600 ఇళ్లు అమ్ముడయ్యాయి.

ఇదీ చదవండి:2045 వరకు చమురే ప్రధాన ఇంధన వనరా?

ABOUT THE AUTHOR

...view details