తెలంగాణ

telangana

By

Published : Jul 16, 2021, 10:28 AM IST

ETV Bharat / business

వావ్‌.. హైదరాబాద్‌- ఇళ్ల విక్రయాలు 150% జంప్!

కరోనా సంక్షభమున్నా హైదారాబాద్​లో ఇళ్ల విక్రయాల్లో భారీ వృద్ధి నమోదైనట్లు తెలుస్తోంది. రియల్టీ కన్సల్టెంట్​ సంస్థ నైట్​ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం.. హైదారాబాద్​లో ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య 11,974 ఇళ్లు/ఫ్లాట్ల విక్రయాలు నమోదైనట్లు తేలింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. ఈ మొత్తం 150 శాతం ఎక్కువ.

Hosing sales rise hugely
భారీగా పెరిగిన ఇళ్ల విక్రయాలు

హైదరాబాద్‌లో కొత్త ఇళ్ల నిర్మాణం, అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక పేర్కొంది. ఈ ఏడాది జనవరి-జూన్‌ నెలల్లో 16,712 కొత్త ఇళ్లు/ఫ్లాట్ల నిర్మాణం ప్రారంభం కాగా, 11,974 ఇళ్లు/ఫ్లాట్ల అమ్మకాలు జరిగాయని తెలిపింది. గత ఏడాది ఇదేకాలంలో 4,422 కొత్త ఇళ్ల నిర్మాణం ప్రారంభమవగా, ఈసారి 278 శాతం అధికమయ్యాయని, అప్పుడు 4,782 ఇళ్లు అమ్ముడుపోగా, ఈసారి 150 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది.

అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు/ఫ్లాట్ల సంఖ్య కూడా ఏడాది వ్యవధిలో 4,037 నుంచి 11,918 కి పెరిగింది. ఇతర ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో (కూకట్‌పల్లి, మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట) నివాస గృహాల నిర్మాణం, అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయని ఈ నివేదిక విశ్లేషించింది.

ముంబయి- మెట్రోపాలిటన్‌ ప్రాంతం, దిల్లీ- ఎన్‌సీఆర్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, పుణె, అహ్మదాబాద్‌ నగరాలన్నింటిలో కలిపి జనవరి-జూన్‌ అమ్మకాలు ఏడాదిక్రితం నాటి 59,538 యూనిట్లతో పోలిస్తే 67 శాతం పెరిగి 99,416 యూనిట్లుగా నమోదయ్యాయి.

ప్రధాన నగరాల్లో విక్రయాలు

ఇదీ చదవండి:హోం లోన్ అప్లికేషన్ రిజక్ట్ అయ్యిందా?

ABOUT THE AUTHOR

...view details