క్యూ3లోనూ తగ్గిన ఇళ్ల విక్రయాలు కానీ...! - హైదరాబాద్‌లో ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు
దేశంలో ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 46 శాతం తగ్గాయి. గత ఏడాది క్యూ3తో పోలిస్తే దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు జులై-సెప్టెంబర్ మధ్య 29,520 యూనిట్లకు పరిమితమైనట్లు ఓ సర్వేలో తేలింది. అయితే దేశంలో కఠిన లాక్డౌన్ అమలులో ఉన్న సమయంతో పోలిస్తే మాత్రం అమ్మకాలు పుంజుకున్నట్లు సర్వే వివరించింది. ఇళ్ల విక్రయాలపై సర్వేలో తేలిన మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
దేశంలో తగ్గిన ఇళ్ల విక్రయాలు
By
Published : Sep 30, 2020, 3:35 PM IST
కరోనా వైరస్ విజృంభణతో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు భారీగా పడిపోయాయి. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 46 శాతం తగ్గి.. 29,520 యూనిట్లకు పరిమితమైనట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అన్‌రాక్ వెల్లడించింది.
2019 ఇదే సమయంలో దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే నగరాల్లో 55,080 ఇళ్లు అమ్ముడైనట్లు పేర్కొంది అన్‌రాక్.
ఈ ఏడాది మొత్తం విక్రయాలూ డీలా..
ఈ ఏడాది మొత్తం మీద (సెప్టెంబర్ వరకు) ఇళ్ల విక్రయాలు దాదాపు 57 శాతం తగ్గినట్లు అనరాక్ నివేదికలో వెల్లడైంది. 2020 జనవరి-సెప్టెంబర్ మధ్య 87,460 ఇళ్లు మాత్రమే అమ్ముడైనట్లు తేలింది. 2019 జనవరి-సెప్టెంబర్ మధ్య 2,02,200 యూనిట్లు విక్రయమవ్వడం గమనార్హం.
గత ఏడాదితో పోలిస్తే విక్రయాల తగ్గినప్పటికీ.. జులై-సెప్టెంబర్ మధ్య ఇళ్ల అమ్మకాలు భారీగా పుంజుకున్నట్లు అన్‌రాక్ ఛైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. లాక్డౌన్ వల్ల ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 12,730కు పడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జులై-సెప్టెంబర్ మధ్య ఇళ్ల విక్రయాలు.. కొవిడ్-19 ముందున్న అమ్మకాల్లో 65 శాతం రికవరీ సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 45,200 ఇళ్లు విక్రయమైనట్లు తెలిపారు.
నగరాల వారీగా ఇళ్ల విక్రయాలు ఇలా..
నగరం
2020 క్యూ3
2019 క్యూ3
దిల్లీ
5,200
9,800
ముంబయి
9,200
17,180
బెంగళూరు
5,400
10,500
పుణే
4,850
8,550
హైదరాబాద్
1,650
3,280
చెన్నై
1,600
2,620
కోల్‌కతా
1,620
3,120
ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల విక్రయాలు ఇలా..
దిల్లీలో 2020 సెప్టెంబర్ వరకు 15,450 గృహాలు విక్రయమయ్యాయి. 2019లో ఈ సంఖ్య 36,210గా ఉంది.
ముంబయిలో 2020 మొదటి 9 నెలల్లో ఇళ్ల విక్రయాలు.. 2019 ఇదే సమయంతో పోలిస్తే 62,550 నుంచి 26,730కి పడిపోయాయి.
బెంగళూరులో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 17,020 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 39,240 యూనిట్లు విక్రయమవ్వడం గమనార్హం.
పుణేలో ఇళ్ల విక్రయాలు 2020లో సెప్టంబర్ నాటికి 14,200గా ఉండగా.. 2019లో 31,380గా ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 4,980 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది 13,110 ఇళ్లు విక్రయమయ్యాయి.
చైన్నై, కోల్‌కతాల్లో ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య వరుసగా.. 4,280, 4,800 యూనిట్లుగా నమోయ్యాయి. 2019 ఇదే సమయంలో ఈ విక్రయాలు వరుసగా 9,040, 10,670 యూనిట్లుగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.