తెలంగాణ

telangana

ETV Bharat / business

మాంసం, కూరగాయల ధరల పెరుగుదలకు కారణమేంటి? - కూరగాయల ధరల పెరుగుదల

కరోనా సంక్షోభంతో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. జూన్​, జులై వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) డేటాను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ 3,4 నెలల్లోనే ఈ స్థాయిలో ధరలు పెరగడానికి కారణమేంటి? ఏయే అంశాలు పెరుగుదలకు తోడ్పడ్డాయి?

retail inflation
ద్రవ్యోల్బణం

By

Published : Aug 16, 2020, 12:31 PM IST

కొన్ని నెలలుగా నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే పప్పులు, మాంసం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి.

జూన్​, జులై నెలల్లో వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) డేటాను పరిశీలిస్తే ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో పెరిగిందో అర్థమవుతుంది. పాలు, పండ్లు, దుస్తులు, వైద్యం వంటి ధరలతో పోల్చినా పై వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి.

గతేడాదితో పోలిస్తే వివిధ వస్తువుల ద్రవ్యోల్బణం ఇలా..

  • మాంసం, చేపలు రిటైల్ ధరలు జులైలో 18.8శాతం పెరిగాయి. జూన్​లోనూ 16.2 శాతం పెరుగుదల నమోదైంది.
  • పప్పు ధాన్యాల ధరలు జులైలో 15.9 శాతం, జూన్​లో 16.7 శాతం పెరిగాయి.
  • మార్చి నుంచి భారీగా పెరుగుతున్న కూరగాయల ధరలు జులైలోనూ 11.3 శాతం పెరిగాయి.
  • సుగంధ ద్రవ్యాల ధరలు జులైలో 13.3 శాతం, జూన్​లో 11.7 శాతం పెరిగాయి.
  • వ్యక్తిగత సంరక్షణ వస్తువుల్లోనూ పెరుగుదల నమోదైంది. జులైలో 13.6 శాతం, జూన్​లో 12.4 శాతం ధరలు పెరిగాయి. బంగారం ధరలు 27 శాతం పెరగటమే ఇందుకు కారణం. గతేడాదితో పోలిస్తే బంగారం ధర 40శాతం పెరిగింది.

కరోనా వ్యాప్తి..

చైనాలో కరోనా వ్యాప్తి, ఆ దేశ​ ఉత్పత్తులపై వ్యతిరేకతతో సబ్బులు, షాంపూలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయి. రూపాయి మారకం బలహీన పడటమూ ఎలక్ట్రానిక్ దిగుమతుల ఖర్చును పెంచాయి.

ఇంధన ధరలు..

పెట్రోల్, డీజిల్ అధిక ధరల వల్ల రవాణా ఖర్చులు జులైలో 10శాతం పెరిగాయి. దీని ప్రభావం ఇతర వస్తువులపైనా పడి ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఈ కారణాల వల్లే దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలకు మించి జులై నెలకు గాను 6.93 శాతం నమోదైంది.

ఇదీ చూడండి:ఆహార ధరలు పెరిగినా టోకు ద్రవ్యోల్బణం డౌన్

ABOUT THE AUTHOR

...view details