వయోజనుల కోసం కొవావాక్స్ టీకాను ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా శుక్రవారం తెలిపారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో పిల్లలకు వినియోగించేందుకు ఈ టీకాను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ మేరకు హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అనంతరం పూనావాలా మాట్లాడారు. దాదాపు 30 నిమిషాలపాటు వారిద్దరూ భేటీ అయ్యారు.
"టీకా ఉత్పత్తిలో మాకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాకారం అందిస్తోంది. అందుకు కృతజ్ఞతలు. డిమాండ్‌కు తగ్గట్టుగా కొవిషీల్డ్ టీకా ఉత్పత్తిని విస్తరించేందుకు మా సంస్థ ప్రయత్నిస్తోంది. డీసీజీఐ అనుమతి పొందిన అనంతరం.. కొవావాక్స్ టీకాను పెద్దల కోసం అక్టోబర్‌లో విడుదల చేయాలని ఆశిస్తున్నాం. పిల్లల కోసం ఈ టీకాను వచ్చే ఏదాడి మొదటి త్రైమాసికంలో అందుబాటులోకి తెస్తాం."
-అదర్ పూనావాలా, సీరం సంస్థ సీఈఓ