ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హోండా మోటర్స్ సరికొత్త మైలురాయిని అధిగమించింది. బీఎస్-6 ఉద్గార ప్రమాణాలతో రూపొందించిన ద్విచక్రవాహనాలు ఇప్పటివరకు మొత్తం 5.5లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు వెల్లడించింది. ఈ మేరకు హోండా మోటర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ మార్కెటింగ్) యద్విందర్ సింగ్ గులేరియా ఓ ప్రకటనలో తెలిపారు.
"హోండా నుంచి ఇప్పటివరకు ఆరు రకాల బీఎస్6 మోడల్ ద్విచక్రవాహనాలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. వాటిలో యాక్టివా 125, ఎస్‌పీ 125, యాక్టివా 6జీ, షైన్, యూనికార్న్, డియో మోడళ్లు ఉన్నాయి. బీఎస్-6 యుగంలో సంస్థ మరింత దూసుకుపోయేందుకు ఈ మోడళ్లు ఎంతో సహకరిస్తాయి. ఈ ద్విచక్రవాహనాలపై సంస్థ ప్రకటించిన 6 సంవత్సరాల వారెంటీ ప్యాకేజీ కారణంగా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది"