హోండా కార్స్ ఇండియా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. గరిష్ఠంగా రూ.33,496 వరకు వినియోగదారులు లబ్ధి పొందే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్లు అమేజ్, డబ్ల్యూ-ఆర్, జాజ్‌కు వర్తిస్తాయి. ఈ ఆఫర్లు మోడల్, వేరియంట్, ప్రదేశాన్ని బట్టి మారుతాయని హోండా వెల్లడించింది. జూన్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని వివరించింది.
ఆఫర్లు ఇలా..
హోండా అమేజ్ సెడాన్‌పై అన్నిటికంటే అత్యధికంగా రూ.33,496 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది ఎస్‌ఎంటీ పెట్రోల్ వేరియంట్‌పై వర్తిస్తుంది. దీనిలో రూ.15 వేల వరకు నగదు డిస్కౌంట్, ఎక్స్ఛేంజీ బోనస్ రూ.15 వేలు లభిస్తాయి. ఇక క్యాష్ డిస్కౌంట్ వద్దు అనుకుంటే రూ.18,496 విలువైన యాక్సెసరీస్ పొందవచ్చు. మిగిలిన వేరియంట్లలో అన్ని కలిపి రూ.15,998 వరకు లబ్ధి పొందవచ్చు.
హోండా జాజ్ ప్రీమియం హాచ్‌బ్యాక్ కారుపై మొత్తం డిస్కౌంట్ రూ.21,908గా ఉంది. వీటిల్లో రూ.10వేల నగదు డిస్కౌంట్ కాగా.. రూ.10వేలు ఎక్స్ఛేంజీ బోనస్. నగదు డిస్కౌంట్ వద్దనుకుంటే రూ.11,908 విలువైన యాక్సెసరీస్ ఇస్తారు. హోండా డబ్ల్యూఆర్-వీపై మొత్తం రూ.22,158 డిస్కౌంట్ ఇస్తున్నారు.
ఇదీ చదవండి:వన్‌ప్లస్ నుంచి బడ్జెట్ 5జీ ఫోన్- ఫీచర్లు లీక్