ప్రతి కుటుంబం తమకంటూ ఒక ఇల్లు ఉండాలని కోరుకుంటారు. చాలా కొద్దీ మందికే వారసత్వంగా ఇల్లు లభించవచ్చు. ఒకవేళ ఉన్నా , చేసే ఉద్యోగం లేదా వ్యాపారం ఒకచోట - ఆ ఇల్లు వేరొక చోట ఉండడం, లేక పాతదై పోవడం, తమ సంపాదనకు తగిన నివాసయోగ్యంగా లేకపోవడం వంటి అనేక కారణాల వలన కొత్త ఇల్లు కొనాలని చాలా మంది కోరుకుంటారు. అదీగాక మగవారితోపాటు ఆడవారు కూడా సంపాదన చేయడం , తద్వారా చిన్న కుటుంబాలు ఎక్కువ అవడం జరుగుతున్నాయి. చిన్న వయసులోనే సొంత ఇంటిని సాకారం చేసుకునేందుకు చూస్తున్నారు. పాత రోజులలో 25-30 ఏళ్ళు సంపాదించిన సొమ్మును జాగ్రత్త పరుచుకుని ఇల్లు కట్టుకోవడం జరిగేది.
మారుతున్న రోజులకు అనుగుణంగా బ్యాంకులు గృహ రుణాలను మంజూరు చేస్తున్నాయి. కేంద్ర ప్రభ్యత్వం ’ 2022 సంవత్సరం నాటికి అందరికీ ఇళ్ళు ’ అనే నినాదంతో సబ్సిడీని ఇస్తోంది. అలాగే రూ 45 లక్షల వరకు స్టాంప్ డ్యూటీ విలువ గల ఇళ్లను ’ సరసమైన ధర గల ఇల్లు’ గా పరిగణించి , చెల్లించే గృహ రుణ వడ్డీపై అదనంగా రూ 1.50 లక్షల వరకు మినహాయింపు ఇస్తున్నారు. అంటే వార్షికంగా మొత్తం రూ 3.50 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు పొందొచ్చు. 31స్థ మార్చి 2021 వరకు సరసమైన ధర గల ఇల్లు తీసుకునే వారికి ఈ మినహాయింపు అందుబాటులో ఉంటుంది.
గత ఏడాది అక్టోబర్ నుంచి రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఆదేశాల మేరకు , చాలా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను రేపో రేట్ తో అనుసంధానించాయి. దీనివలన రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా రేపో రేట్ ను తగ్గించినా, పెంచినా , తదనుగుణంగా బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను మార్చవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ రేపో రేట్ 5.15 శాతంగా ఉంది. ఈ రేపో రేట్ ఫై బ్యాంకులు తమ నిర్వహణ ఖర్చులను జోడించవచ్చు. అలాగే రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ నిమిత్తం 0.10 శాతం నుంచి 0.40 శాతం వరకు (10-40 బేసిస్ పాయింట్స్ ) వరకు అదనపు వడ్డీని విధించవచ్చు.
ఈ కింది పట్టిక ద్వారా ఏ ఏ బ్యాంకులు ఎంత వడ్డీని విధిస్తున్నాయి తెలుసుకోవచ్చు.
ఈ కింది పట్టిక ద్వారా 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కాలానికి గృహ రుణం తీసుకుంటే వార్షిక వడ్డీ 8.5 శాతం తో నెలకు చెల్లించాల్సిన ఈ ఎం ఐ ఎంత పడుతుంది, అలాగే పూర్తి కాలానికి చెల్లించే మొత్తం వడ్డీ ఎంతో తెలుసుకోవచ్చు.