తెలంగాణ

telangana

ETV Bharat / business

'రెండేళ్లలో 35వేల కోట్లకు డిజిటల్​ మీడియా వ్యాపారం'

దేశంలో 2021 నాటికి డిజిటల్​ మీడియా వ్యాపారం రూ.35,700 కోట్లకు చేరనుందని ఫిక్కీ-ఈవై నివేదిక వెల్లడించింది. నానాటికి పెరుగుతున్న అంతర్జాల వినియోగదారులతో 2019 నాటికి చిత్ర పరిశ్రమను, 2021 నాటికి ప్రింట్​ మీడియాను వెనక్కి నెడుతుందని పేర్కొంది.

'రెండేళ్లలో రూ.35 వేల కోట్లకు డిజిటల్​ మీడియా వ్యాపారం'

By

Published : Jul 23, 2019, 6:56 AM IST

Updated : Jul 23, 2019, 4:27 PM IST

భారత్​లో అంతర్జాల వినియోగదారుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్​ మీడియా రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఫిక్కీ-ఈవై విడుదల చేసిన తాజా నివేదికే అందుకు నిదర్శనం. 2019 నాటికి చలన చిత్ర వినోద రంగాన్ని, 2021 నాటికి ప్రింట్​ మీడియా రంగాన్ని అధిగమించి సుమారు రూ. 35,700 కోట్లకు చేరుకుంటుందని ప్రకటించింది.

  • 2018లో చిత్ర పరిశ్రమ వ్యాపారం రూ.17,500 కోట్లుగా నమోదయింది. అది 2019లో రూ.19,600 కోట్లకు చేరుకోవచ్చని నివేదిక అంచనా వేసింది.
  • 2018లో రూ. 30,800 కోట్లుగా ఉన్న ప్రింట్​ మీడియా రంగం.. 2021 నాటికి రూ.33, 600 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.
  • 2018లో డిజిటల్​ మీడియా వ్యాపారం 42 శాతం వృద్ధితో రూ.16,800 కోట్లకు చేరుకుంది. భారతీయులు మొబైల్​​ వినియోగ సమయంలో 30 శాతం వినోదానికే కేటాయిస్తున్నారు. దీని ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం డిజిటల్​ మీడియా సుమారు రూ.22,400 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.

రెండో స్థానంలో...

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాల వినియోగదారుల జాబితాలో 57 కోట్లకు పైగా ఇంటర్నెట్​ యూజర్లతో భారత్​ రెండోస్థానంలో ఉంది. ఈ సంఖ్య ఏటా సుమారు 13 శాతం మేర పెరుగుతోంది. 2018లో ఆన్​లైన్​ వీడియో వీక్షకుల సంఖ్య 32.5 కోట్లుగా ఉంది. ఆన్​లైన్​ మ్యూజిక్​ తదితర ఆడియో సేవలు పొందుతున్న వారి సంఖ్య 15 కోట్లకు చేరింది. 2021 నాటికి ఈ సంఖ్య గణనీయంగా పెరగనుంది.

భారతీయ మీడియా, వినోద రంగం వ్యాపార పరిమాణం 2017 నాటికి 23.9 బిలియన్​ డాలర్లుగా నమోదయింది. అది 2021 నాటికి 33.6 బిలియన్​ డాలర్లకు చేరుకోనుందని నివేదిక అంచనా వేసింది.

ఇదీ చూడండి: 'భారత్​మాలా'కు ఎల్​ఐసీ రూ. 1.25 లక్షల కోట్ల రుణం

Last Updated : Jul 23, 2019, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details