Union Budget 2022: పార్లమెంటులో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుందంటే అందరికీ గుర్తుచ్చొది సూట్‌కేసు. ఆర్థికమంత్రి ఎలాంటి సూట్‌కేసు తీసుకొస్తారా అని ఆసక్తి ఉండేది. అయితే ఎన్డీఏ హయాంలో సూట్‌కేసు సంప్రదాయానికి చెక్ పడింది. 2020లో ఎర్రటి సంచిలో బడ్జెట్ ప్రతులు తీసుకొచ్చారు నిర్మలా సీతారామన్. 2021లోనూ ఎర్రటి బ్యాగులో ట్యాబ్‌లో బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2022లోనూ అదే ట్రెండ్ కొనసాగించారు. డిజిటల్ విధానంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ కాపీలు యాప్ ద్వారా అందరికీ అందుబాటులో ఉండనున్నాయి.
అయితే.. బడ్జెట్ ప్రతులు తెచ్చే సూట్‌కేస్‌కు ఓ చరిత్ర ఉందని తెలుసా? ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? కాలక్రమేణా రంగులు, పరిమాణంలో మార్పుల గురించి విన్నారా? అసలు ఈ బడ్జెట్‌కు, లెదర్ సూట్కేసుకు సంబంధం ఏమిటో తెలుసా..?
ఫ్రెంచ్ నుంచి వాడుకలోకి..
బడ్జెట్‌ను ఫ్రెంచ్ భాషలో బోగెటి అంటారు. దీని ఇంగ్లీష్ అర్థమే లెదర్ బ్యాగ్. 1860లో బ్రిటన్ మొదటి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్‌స్టోన్ మొదట లెదర్ బ్యాగ్‌లో పత్రాలు తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలా ఆయనతో మొదలైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
బ్రిటిష్ సంప్రదాయాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన వాళ్లూ కొనసాగిస్తూ వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపే శక్తి ఈ లెదర్ సూట్‌కేసులో ఉంటుంది. అందుకే.. మంత్రి చేతిలో ఉండే ఈ సూట్‌కేసును ప్రత్యేకంగా పరిగణిస్తారు. అయితే.. ఆ బ్రీఫ్‌కేసును తెచ్చే సంప్రదాయం మారకపోయినా.. దాని రంగులు మాత్రం మారుతూ వచ్చాయి.
ఈ సూట్‌కేసులను ఆర్థిక మంత్రిత్వ శాఖనే సేకరిస్తోంది. విభిన్న రంగుల్లోని నాలుగు బ్యాగ్‌లను ఆర్థిక మంత్రి ముందు ఉంచుతుంది. వాటిలో నచ్చిన రంగును ఎంచుకోవచ్చు.