తెలంగాణ

telangana

ETV Bharat / business

అన్​లాక్​తో పెరిగిన ఉద్యోగ నియామకాలు - పెరిగిన ఉద్యోగ నియామకాలు

లాక్​డౌన్​ సమయంతో పోలిస్తే.. నిబంధనల సడలింపు తర్వాత దేశవ్యాప్తంగ ఉద్యోగ నియామకాలు పుంజుకున్నాయి. జూన్​తో పోలిస్తే.. ఉద్యోగాల నియామకాలు జులైలో 5 శాతం పెరిగినట్లు నౌక్రీ డాట్​కామ్​ తాజా నివేదికలో వెల్లడించింది. సర్వేలో తెలిసిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Hiring activity in India
సాధారణ స్థాయికి చేరుతున్న ఉద్యోగ నియామకాలు

By

Published : Aug 12, 2020, 6:50 PM IST

దేశవ్యాప్తంగా అన్​లాక్​ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నియామకాలు కూడా నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. జూన్​తో పోలిస్తే.. జులైలో ఉద్యోగ నియామకాలు దేశవ్యాప్తంగా స్వల్పంగా 5 శాతం పెరిగినట్లు ప్రముఖ జాబ్​ పోర్టల్​ నౌక్రీ డాట్​కామ్​ సర్వేలో తేలింది.

అయితే గత ఏడాది జులైతో పోలిస్తే 2020 ఏడో నెలలో ఉద్యోగ నియామకాలు భారీగా తగ్గినట్లు సర్వే పేర్కొంది.

సర్వేలోని ముఖ్యాంశాలు..

  • హోటళ్లు, రెస్టారెంట్​లు, విమాన రంగం, పర్యటకం, రిటైల్, రియల్ ఎస్టేట్​, ఆయిల్​ & గ్యాస్, విద్యుత్​ రంగాల్లో జులైలో (2019 జులైలో పోలిస్తే) నియామకాలు భారీగా తగ్గాయి
  • బీపీఓ/ఐటీ, ఎఫ్​ఎంసీజీ, ఫార్మా, ఐటీ హార్డ్​వేర్​, హెల్త్​కేర్​, మీడియా, వినోదం, నిర్మాణ రంగాల నియామకాల్లో క్షీణత తక్కువగా ఉంది.
  • దేశవ్యాప్తంగా జులైలో (2019 జులైతో పోలిస్తే) ఉద్యోగ నియమాకాలు దాదాపు 47 శాతం తగ్గాయి. మెట్రో నగరాల్లో.. జాతీయ సగటైన 47 శాతం కన్నా కాస్త ఎక్కువగా 50 శాతం క్షీణించాయి.
  • చెన్నై, ముంబయి, బెంగళూరు నగరాల్లో నియమాకాల తగ్గుదల ఎక్కువగా ఉంది. ఛండీగఢ్, జైపుర్, కొచ్చి పట్టణాల్లో నియామకాలు స్వల్పంగా తగ్గాయి.

ఇదీ చూడండి:గుడ్​న్యూస్​: భారీగా తగ్గిన బంగారం ధరలు

ABOUT THE AUTHOR

...view details