మార్చిలో నియామకాలు స్వల్పంగా పెరిగాయి. ఫిబ్రవరిలో 2,356 నియామక ప్రకటలు రాగా.. మార్చిలో ఆ సంఖ్య 2,436కు పెరిగిందిని.. నౌకరీ జాబ్‌స్పీక్ సూచీ తెలిపింది. మార్చిలో 3 శాతం ఉద్యోగాలు పెరగటానికి ఐటీ-సాఫ్ట్వేర్, రిటైల్ రంగాలు దోహదపడ్డాయి. కంపెనీలు డిజిటల్‌కు మారుతున్నందున ఐటీ-సాఫ్ట్వేర్ రంగంలో నియామకాలు మార్చిలో 11 శాతం వృద్ధి చెందాయి. రిటైల్ రంగంలోనూ అదే స్థాయిలో నియామకాలు పెరిగాయి. నౌకరీ డాట్‌కామ్ వెబ్‌సైట్‌పై నెలవారీగా నమోదయ్యే ఉద్యోగాల ఆధారంగా నౌకరీ జాబ్‌స్పీక్ సూచీని లెక్కిస్తారు.
మార్చిలో నియామకాలు పుంజుకున్నాయ్ - నౌక్రీ నియామకాల సర్వ
మార్చిలో ఉద్యోగ నియామకాలు 3 శాతం పెరిగినట్లు నౌకరీ డాట్‌కామ్ నెలవారీ నివేదిక వెల్లడించింది. ఐటీ-సాఫ్ట్వేర్, రిటైల్ రంగాలు ఇందుకు దోహదం చేసినట్లు తెలిపింది.
పెరిగిన ఉద్యోగ నియామకాలు
మార్చిలో నియామకాలు ఇలా..
- బీపీఓ/ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ఐ 1 శాతం చొప్పున వృద్ధి నమోదు చేశాయి. కొవిడ్-19 రెండో దఫాలో విద్య/శిక్షణ 13 శాతం, ఎఫ్ఎంసీజీ 10 శాతం, హోటళ్లు/విమానయానం/పర్యటకం 8 శాతం చొప్పున క్షీణతను చవిచూశాయి.
- ఆరు మెట్రో నగరాలు, కీలక ద్వితీయ శ్రేణి నగరాల్లో నియామకాలు పెరిగాయి. కోల్‌కతా 3 శాతం, వడోదరా 2 శాతం చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి. అహ్మదాబాద్‌లో 13 శాతం వృద్ధి లభించింది.
- మార్కెటింగ్/ప్రకటనల్లో నిపుణులకు 8 శాతం చొప్పున గిరాకీ కనిపించింది. అమ్మకాల నిపుణులకు గిరాకీ 6 శాతం తగ్గింది.
- 4-7 ఏళ్లు, 8-12 ఏళ్లు అనుభవం కలిగిన వృత్తి నిపుణుల నియామకాలు 6 శాతం పెరిగాయి. 16 ఏళ్లకుపైగా అనుభవం కలగిన నాయకుల నియామకాలు 3 శాతం తగ్గాయి.
ఇదీ చదవండి:పాస్వర్డ్ సేవ్ చేయకుండా 'బ్రౌజర్' నియంత్రణ ఎలా?