కరోనా నుంచి ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థితికి చేరుతున్న తరుణంలో..సెప్టెంబర్లో ఉద్యోగ నియామకాలు పెరిగినట్లు ఓ సర్వేలో తేలింది. ప్రముఖ ఆన్లైన్ జాబ్ పోర్టల్ నౌక్రీ ప్రకారం.. ఆగస్టుతో పోలిస్తే ఉద్యోగ నియామకాల కార్యకలాపాలు సెప్టెంబర్లో 24శాతం పుంజుకున్నాయి.
'సెప్టెంబర్లో 24శాతం పెరిగిన నియామకాలు' - ఆన్లాక్తో పెరిగిన ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా అన్లాక్ ప్రక్రియతో ఉద్యోగ నియామకాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. సెప్టెంబర్లో నియామకాలు.. ఆగస్టుతో పోలిస్తే 24 శాతం పెరిగినట్లు ప్రముఖ జాబ్ పోర్టల్ నౌక్రీడాట్కామ్ నివేదికలో వెల్లడైంది.
ఉద్యోగనియమాకాల్లో వృద్ధి
నౌక్రీ నివేదికలో ముఖ్యాంశాలు..
- ఫార్మా రంగం (44 శాతం), ఎఫ్ఎంసీజీ (43 శాతం), విద్య- టీచింగ్ (41 శాతం) విభాగాల్లో ప్రధానంగా నియామకాల్లో వృద్ధి నమోదైంది.
- అన్లాక్ ప్రక్రియతో రియల్టీ రంగంలో నియామకాల కార్యకలాపాలు భారీగా (44 శాతం) పెరిగాయి.
- ఆటో.. దాని అనుబంధ రంగాలు (29 శాతం), ఆతిథ్య- పర్యటక రంగాల్లో (48 శాతం) నియామక కార్యకలాపాలు పుంజుకున్నాయి.
- కీలక రంగాలైన బీపీఓ, ఐటీలో 29 శాతం, బ్యాంకింగ్ ఆర్థిక సేవల విభాగాల్లో 33 శాతం నియామకాల్లో వృద్ధి నమోదైంది.
- నగరాల వారీగా చూస్తే.. పుణెలో అత్యధికంగా 26శాతం, హైదరాబాద్, చెన్నైలలో 24శాతం, బెంగళూరులో 14శాతం నియామకాలు పుంజుకున్నాయి.
- నియామకాలు భారీగా పుంజుకున్న టైర్ 2 పట్టణాల్లో.. అహ్మదాబాద్ (34 శాతం), ఛండీగఢ్ (39 శాతం), జైపుర్ (36 శాతం)లు ఉన్నాయి.
ఇదీ చూడండి:పండుగలకు ముందు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త