దేశవ్యాప్తంగా రోజుకు 30 కిలోమీటర్ల మేర రహదారుల్ని నిర్మించి కొత్త ఘనతని సాధించామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో.. మొత్తం 11 వేల 35 కిలోమీటర్ల రహదారులను నిర్మించామని ఆయన పేర్కొన్నారు. అంటే రోజుకు సగటున 32.85 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఈ రికార్డును సాధించామన్నారు. మార్చి 31 కల్లా ఈ వేగాన్ని 40 కిలోమీటర్లకు చేరుకుంటామని గడ్కరీ పేర్కొన్నారు.
''ఈ ఆర్థిక సంతవ్సరం ఇప్పటివరకు 11 వేల 35 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించాం. అంటే రోజుకు సగటున 32.85 కి.మీ. నిర్మాణం జరిగింది. ఇదో కొత్త రికార్డు.''
- నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి
భారతమాల ప్రాజెక్టు కింద దాదాపు 5.35 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో.. 34 వేల 800 కిలోమీటర్ల మేర హైవేలను నిర్మిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి.