ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ సైకిళ్లు, స్కూటర్ల తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' మరో అరుదైన ఘనతను సాధించింది. కంపెనీకి చెందిన బైక్‌లతో అత్యంత భారీ సైజు లోగోను ఆవిష్కరించి 'గిన్నిస్' రికార్డు సొంతం చేసుకుంది.
ఒకప్పుడు కలిసి ద్విచక్ర వాహనాలు తయారు చేసిన హోండా నుంచి విడిపోయి.. ఒంటరిగా కార్యకలాపాలు ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
రికార్డు వివరాలు ఇలా..
హీరోలో అత్యధికంగా అమ్ముడయ్యే స్ల్పెండర్ ప్లస్ బైక్‌లను ఉపయోగించి ఈ రికార్డు సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉన్న కంపెనీ తయారీ యూనిట్లో 1000 అడుగులు x 800 అడుగుల ఖాళీ స్థలంలో.. 1,845 బ్లాక్ కలర్ స్ల్పెండర్ ప్లస్ బైక్‌లను ఒకదాని పక్కన మరొకటి నిలిపి.. ఈ భారీ లోగోను రూపొందించింది.
స్థలాన్ని చదును చేసేందుకు, లోగో ప్రణాళికలు రూపొందించేందుకు 90 రోజుల సమయం పట్టింది. మొత్తం 100 మంది సిబ్బంది, నిపుణులు 300 గంటలు శ్రమించి దీనిని సాధ్యం చేశారు.
ఇదీ చదవండి:2020-21 వడ్డీ చెల్లింపుపై ఈపీఎఫ్ఓ క్లారిటీ!